దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 2022 ఆగస్టు 15 నాటికి 75 ఏళ్లు పూర్తికావొస్తున్న నేపథ్యంలో కేంద్రం ‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ శుక్రవారం నాడు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ప్రారంభించారు. ఈ మేరకు సబర్మతి ఆశ్రమంలో జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి మోదీ నివాళులర్పించారు. అనంతరం అభయ్ ఘాట్ సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎగ్జిబిషన్‌ను మోదీ వీక్షించరు.
కాగా ‘అమృత్ మహోత్సవ్’సందర్భంగా నేటి నుంచి 75 ప్రాంతాల్లో 75 వారాల పాటు వివిధ కార్యక్రమాలు జరుగుతాయి. అటు దండి మార్చ్ వార్షికోత్సవం సందర్భంగా అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు నిర్వహించే పాదయాత్రను మోదీ ప్రారంభించగా.. 81 మంది 25 రోజుల పాటు 241 మైళ్ల దూరం ఈ యాత్ర చేస్తారు. ఈ పాదయాత్ర ఏప్రిల్ 5న ముగియనుంది.