టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తోన్న అథ్లెట్లకు..ఇవాళ్టి మన్ కీ బాత్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసించారు. ఏదైనా నేర్చుకోవడం అంటే ఆ విభాగంలో ఉన్నత స్థానానికి వెళ్లడమే అని మోడీ అన్నారు. నిన్న 49 కిలోల వెయిట్ లిప్టింగ్ విభాగంలో మీరాబాయి చానుకు సిల్వర్ మెడల్ సాధించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు మోడీ.
ఇక వ్యవసాయ రంగంలో మణిపూర్, త్రిపుర సాధిస్తోన్న ప్రగతి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. ఇటీవల మణిపూర్‌లో ఆపిల్ సాగు చేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లి శిక్షణ పొందుతున్నారని తెలిపారు. రింగ్ ఫమి యంగ్ శిక్షణ తీసుకుంటున్నారని మోడీ గుర్తుచేశారు. నీటి పొదుపు గురించి కూడా మోడీ ప్రస్తావించారు. జలమే జీవ జాలం అని పేర్కొన్నారు. తన బాల్యంలో నీటి ఎద్దడిని ఎదుర్కొన్నానని మోడీ తెలిపారు. నీటి ఆదా మన దైనందిన జీవితంలో భాగం కావాలని కోరారు. ఇందులో ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలని కోరారు. కుటుంబం, గ్రామాలు అంతా నీటిని పొదుపుగా వాడాలని సూచించారు. దేశంలో మన్ కీ బాత్‌కు ఎక్కువ స్పందన వస్తుందని తెలిపారు. యువతే ఎక్కువ ఫాలొ కావడం సంతోషంగా ఉందని చెప్పారు.
ఇది కూడా చదవండి: కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ పై సుప్రీంకోర్టులో కేసు వేసి స్టే తీసుకురావాలి: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి