ముంబయిలో ఫిబ్రవరి 10న పర్యటించనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ మేరకు తన పర్యటనలో బోహ్రా ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన ఓ కార్యక్రమంలో మోడీ పాల్గొననున్నారు. ఇక్కడ ఆయన అల్ జామియా తాస్ సైఫియా విద్యాపీఠ్‌ను కూడా ప్రారంభించనున్నారని అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రధాని పర్యటన నేపథ్యంలో ముంబయి పోలీసులు ఇప్పటికే భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ముంబయిలో ఈ నెల 10న వందే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. దానికంటేముందు, ఫిబ్రవరి 6న ప్రధాని ఇండియా ఎనర్జీ వీక్ ను ప్రారంభించి కర్ణాటకలోని బెంగళూరు, తుమకూరులో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
షెడ్యూల్ ప్రకారం, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ నుండి సాయి నగర్ షిర్డీ, షోలాపూర్ నుండి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ వరకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఆయన జెండా ఊపి ప్రారంభిస్తారు. కాగా రెండు రైళ్లు చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేయబడ్డాయి. మోడీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిన తర్వాత ఇప్పుడు ముంబయి నుంచి మూడు వందేభారత్ రైళ్లు నడవనున్నాయి. రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఒకటి ఇప్పటికే ముంబైలోని CST స్టేషన్‌కు చేరుకుంది. మరోవైపు, రైల్వే అధికారుల నుండి అందిన సమాచారం ప్రకారం, రెండవ కొత్త వందే భారత్ రైలు ఫిబ్రవరి 6 న ముంబయికి చేరుకుంటుంది. ముంబయి – షిర్డీ రైలు థాల్ ఘాట్ నుండి ప్రారంభమై 5.25 గంటల్లో 340 కిలో మీటర్లు, ముంబయి – షోలాపూర్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ భోర్ ఘాట్ నుండి నడిచే అవకాశం ఉంది. ఇది 6.35 గంటల్లో సుమారు 455 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది.