ప్రధానమంత్రి నరేంద్రమోడీ జీ… దేశంలో తక్షణమే ఉమ్మడి పౌరస్మృతి తీసుకురండి అని మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ థాకరే డిమాండ్ చేశారు. జనాభా నియంత్రణ చట్టాలను సత్వరమే తేవాలని కోరారు. ఔరంగాబాద్ పేరును శంభాజీనగర్‌గా మార్చాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారంనాడిక్కడ సభలో రాజ్‌థాకరే మాట్లాడుతూ చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేసిన లౌడ్‌స్పీకర్లను మహారాష్ట్ర ప్రభుత్వం తొలగించకపోతే మసీదుల ఎదుట హనుమాన్ చాలీసాను వినిపించాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. లౌడ్ స్పీకర్లపై తమ పోరాటాన్ని ఇష్టపడనివారు జైలులో పెట్టాలని కుట్ర పన్నారని ఆరోపించారు. జూన్ 5న అయోధ్య పర్యటన వాయిదా వేసుకోవడానికి చాలా కారణాలున్నాయని రాజ్‌థాకరే వివరించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..