పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం (మార్చి 21) భూటాన్ పర్యటనకు వెళ్తున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ రెండు రోజుల భూటాన్ పర్యటన ఖరారైంది. ఈ పర్యటనలో భాగంగా భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్‌తో ప్రధాని మోదీ భేటీ కానున్నారు.
ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తారు. భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గేతోనూ మోదీ సమావేశమై చర్చలు జరపున్నారు. ఇరుదేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు మరింత బలోపేతం అయ్యేలా ముందుకు సాగనున్నారు.