ప్రధాని మోదీ కేరళలోని కన్నూర్ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయ్యారు. ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్, గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఆయనకు స్వాగతం పలికారు. వయనాడ్లో పీఎం ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. అనంతరం సహాయక శిబిరాలను సందర్శించి బాధితులతో మాట్లాడతారని తెలుస్తోంది. సీఎం, ఉన్నతాధికారులతో ఇవాళ మధ్యాహ్నం ఆయన సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది.
వయనాడ్లో తీవ్రంగా నష్టపోవడం వల్ల.. రిహాబలిటేషన్ కోసం రెండు వందల కోట్లు ఇవ్వాలంటూ కేంద్రాన్ని రాష్ట్ర సర్కారు కోరింది. కొండచరియల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో.. హెలికాప్టర్ ద్వారా ప్రధాని మోదీ ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి సురేశ్ గోపి ఉంటారు. తాజాగా జరిగిన వయనాడ్ విలయంలో సుమారు 226 మంది మరణించారు. ఇంకా ఆచూకీ లేని వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నది.
- Advertisement -