Wednesday, November 20, 2024

ఐదు భాష‌ల్లో “కేస‌రియా” సాంగ్ పాడిన సింగ‌ర్.. ప్ర‌శంసించిన ప్ర‌ధాని మోడీ

పంజాబ్ కి చెందిన ఒక గాయకుడు స్నేహదీప్ సింగ్ కల్సి ఐదు వేర్వేరు భాషల్లో కేసరియాను పాటను పాడారు. సోషల్ మీడియాలో తుఫానుగా మారింది. మలయాళం, తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో స్నేహదీప్ బ్రహ్మాస్త్ర పాటను పాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్నేహదీప్ ఈ పాటను బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లోని తన స్నేహితులు – మాజీ సహోద్యోగులకు అంకితం చేస్తూ పాడినట్టు తెలిపాడు.

కాగా, ఈ వీడియో ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ దృష్టిని ఆకర్షించింది. నిన్న (శుక్రవారం) సాయంత్రం, పిఎం మోడీ కేసరియా వ్యక్తి ఫోటోని చేస్తూ అతని ప్రయత్నాలను ప్రశంసించారు. “ఒక పంజాబీ కుర్రాడు మలయాళం, తమిళం, కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో కేసరియా పాడాడు. నాకు దక్షిణాది భాషలు తెలియకపోయినా అద్భుతంగా అనిపిస్తాయి. మరిన్ని భాషలు నేర్చుకోవడం చాలా అందమైన విషయం” అంటూ ట్విట్టర్‌లో షేర్ చేశారు. అంతే కాకుండా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కూడా వీడియోను షేర్ చేశారు.

ఈ వీడియో ఇంటర్నెట్ నుండి విస్తృత ప్రశంసలను అందుకుంటూనే ఉంది. వారిలో ఒకరు ఇలా వ్రాశారు, “ఇటువంటి మధురమైన వాయిస్ మాడ్యులేషన్‌లు, అద్భుతమైన ప్రదర్శన మన గొప్ప దేశం ‘భిన్నత్వంలో ఏకత్వాన్ని’’ చూపుతుంది. మేరా భారత్ మహాన్.” అంటూ ప్రశంసించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement