Saturday, December 21, 2024

PM MODI | కువైట్ పర్యటనలో ప్రధాని మోడీ

రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ కువైట్ బయలుదేరి వెళ్లారు. ఈ రోజు ఉదయం న్యూఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని నరేంద్ర మోడీ.. కువైట్ బయలుదేరి వెళ్లారు. దాదాపు 43ఏళ్ల తర్వాత కువైట్‌లో భారత ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకొంది.

ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా ఇరుదేశాల మధ్య బంధం మరింత బలోపేతం అయ్యేందుకు ఈ పర్యటన దోహదపడనుంది. అలాగే ఇరు దేశాల మధ్య వాణిజ్యం, ఇంధనం, సంస్కృతిక సంబంధాలు పురోగమిస్తాయని భావిస్తున్నారు. 1981లో నాటి భారత ప్రధాని ఇందిరా గాంధీ కువైట్‌లో పర్యటించారు. అనంతరం 2009లో నాటి భారత ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ ఆ దేశంలో పర్యటించారు.

రెండు రోజుల ప్రధాని పర్యటన బిజీ బిజీగా సాగనుంది. ఈ పర్యటనలో కువైట్ రాజు అమీర్ షేక్ మెషల్ అల్ అహ్మద్ అల్ జబ్బర్ అల్ సభాతో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య బంధం మరింత దృఢ పడేందుకు వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన సహకారం, సంస్కృతి, ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాలతోపాటు పలు అంశాలపై కీలకంగా చర్చించనున్నారు. అలాగే కువైట్‌లో నివసించే భారతీయులతో సైతం ప్రధాని మోడీ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement