ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణాదిలో తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును బెంగళూరు రైల్వేస్టేషన్ లో ప్రారంభించారు. కాగా చెన్నై – మైసూరు మధ్య ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నడవనుంది. ఈ రైలులో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి. వీటిలో ఆటోమేటిక్ డోర్స్‌తో పాటు జీపీఎస్ ఆధారిత ఆడియో-విజువల్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంటుంది.
ప్రయాణీకులకు వినోదం కోసం ఆన్‌బోర్డ్ హాట్‌స్పాట్, వైఫై, సౌకర్యవంతమైన సీటింగ్ వంటి సౌకర్యాలను రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకు వచ్చింది. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లోనూ రొటేటింగ్ ఛైర్స్ ను అమర్చారు. 497 కిలోమీటర్ల దూరాన్ని ఈ ట్రైన్ 6 గంటల 40 నిమిషాల్లో చేరుకుటుంది. ఈ రైలు చెన్నై నుంచి బయలుదేరి బెంగళూరు సిటీ జంక్షన్ మీదుగా మైసూరుకు చేరుకుంటుందని అధికారులు తెలిపారు.