Tuesday, September 17, 2024

America | ట్రంప్‌పై కాల్పులు.. ఖండించిన‌ ప్రధాని మోదీ

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై కాల్పులు జరిగాయి. ఈ దాడిలో ఆయ‌న‌ చెవికి గాయమైంది. ప్రస్తుతం అతను బాగానే ఉన్నాడని అధికారులు తెలిపారు. మరోవైపు ఈ దాడిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ ఘటనపై అసహనం వ్యక్తం చేసిన మోదీ.. దాడిని ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి హింసకు తావు లేదని తేల్చి చెప్పారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్టు వెల్లడించారు.

రాహుల్ దిగ్భ్రాంతి…

కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈఘటనపై స్పందించారు. ట్రంప్‌పై హత్యాయత్నం చేయడం తననెంతో దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఇలాంటి దాడుల్ని కచ్చితంగా ఖండించాలని తేల్చిచెప్పారు. ఆయన వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement