పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ సందేశమిచ్చారు. ఆయన తన సందేశంలో టాలీవుడ్ సూపర్ డూపర్ హిట్ మూవీ బాహుబలి ప్రస్తావనను తెచ్చారు. ‘ఈసారి ప్రత్యక్షంగా సమావేశాలు జరుగుతున్నందున ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యమైన అంశాలపైనే ప్రధాన చర్చ ఉంటుంది. అందరూ వ్యాక్సిన్ తప్పకుండా వేసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకుంటే బాహుబలిలా మారవచ్చు. సభలో అర్థవంతమైన, నిర్మాణాత్మకమైన చర్చలు జరగాలి. ప్రతిపక్షాల అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని ప్రధాని మోదీ అన్నారు.
కాగా సోమవారం ఉ.11 గంటలకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలుత నలుగురు కొత్త ఎంపీలతో స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. వీరిలో ఇటీవల తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికైన వైసీపీ ఎంపీ గురుమూర్తి కూడా ఉన్నారు. కాగా నేటి నుంచి ఆగస్టు 13 వరకు పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో 17 కొత్త బిల్లులతో పాటు 2 ఆర్థిక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
ఈ వార్త కూడా చదవండి: శృంగారం కట్టడికి ఒలింపిక్స్ నిర్వాహకుల వింత ఆలోచన