Tuesday, November 26, 2024

తగ్గనున్న మధుమేహ మందుల ధరలు

షుగర్‌ వ్యాధిలో వినియోగించే 45 రకాల మందుల గరిష్ట చిల్లర ధరలను జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (ఎన్‌పీపీఏ) సవరించింది. ఇలా ధరలు సవరించిన వాటిలో కొలెస్ట్రాల్‌, నొప్పి నివారణ మందులు, జీర్ణాశయ సమస్యలు, జలుబు నివారణ మందులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు వాడే సిటాగ్లిప్టిన్‌, మెట్‌ఫామిన్‌, లినాగ్లిప్టిన్‌, మెట్‌పామిన్‌ కాంబినేషన్‌ డ్రగ్స్‌ మందులు సవరించిన జాబితాలో ఉన్నాయి. సిటాగ్లిప్టిన్‌పై మెర్క్‌షార్ప్‌ అండ్‌ డోమ్‌ సంస్థకు ఉన్న పేటెంట్‌ హక్కుల కాలపరిమితి గత నెలతో ముగిసింది. దీనితో మార్కెట్‌లోకి అనేక రకాల సిటాగ్లిప్టిన్‌ జనరిక్‌ మందుదు అందుబాటులోకి వచ్చాయి. పేటెంట్‌ కాలపరిమితి ముగిసినందుకు తగ్గిన ధరలను వినియోగదారులకు అందించే లక్ష్యంతో వీటి ధరలను ఎన్‌పీపీఏ సవరించింది. ప్రస్తుతం మార్కెట్‌లో సిటాగ్లిప్టిన్‌ ప్లస్‌ మెట్‌ఫామిన్‌ ప్యాక్‌ను గరిష్టంగా 15 మాత్రలు ఉండే ప్యాక్‌ను 345 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఏపీపీఏ ఒక్కో ట్యాబ్లెట్‌ ధరను 16 నుంచి 21 రూపాయల మధ్యలోకి తీసుకు వచ్చింది.

లినాగ్లిప్టిన్‌ ప్లస్‌ మెట్‌పామిన్‌ప ఉన్న పేటెంట్‌ హక్క్‌ల కాలపరిమితి కూడా వచ్చే నెలలో ముగియనుంది. అందువల్ల ఈ మాత్రల ధరలను కూడా ఎన్‌పీపీఏ సవరించింది. ఒక్కో మాత్ర గరిష్ట ధరను 16 నుంచి 25 రూపాయలకు సవరించారు. 2.5 ఎంజీ మాత్రధరను 16.17 రూపాయలుగా, 5 ఎంజీ టాబ్లెట్‌ ధరను 25.33 రూపాయలుగా సవరించారు. టైప్‌ 2 డయాబెటిక్‌ పేషంట్లకు డాక్టర్లు ఎక్కువగా సిటాగ్లిప్టిన్‌ లేదా, లినాగ్లిప్టిన్‌ మంది మందులను రాస్తున్నారు. అలర్జీ, జలుబుకు వాడే పారాసిటమాల్‌, ఫినైల్‌ప్రైన్‌, హైడ్రోక్లోరెడ్‌, కెప్టెన్‌ అండ్‌ డిఫెన్‌ హైడ్రామైన్‌ హైడ్రోక్లోరైడ్‌ మిక్స్‌డ్‌ మందుల ఒక్కో ట్యాబ్లెట్‌ ధరను 3.73 రూపాయలుగా నిర్ణయించారు. యాంటీబయోటిక్‌గా ఉపయోగించే ఆమోక్సిసిలిన్‌, పొటాషియం క్లావులనేట్‌ కాంబినేషన్‌తో వచ్చే ఓరల్‌ సస్పెన్షన్‌ ధరను 168.43 రూపాయలుగా సవరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement