Friday, November 22, 2024

జనవరి నుంచి ధరల పెంపు : మారుతీ సుజుకీ

ప్ర‌భ‌న్యూస్ : వచ్చే ఏడాది జనవరి నుంచి కార్ల ధరలు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు ప్రపంచంలోనే అతిపెద్ద కారు తయారీ సంస్థ మారుతీ సుజుకీ ప్రకటించింది. పెరిగిన ఇన్‌పుట్‌ వ్యయాల భారాన్ని తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ పేర్కొంది. అయితే ధరల పెంపులో మోడళ్లను బట్టి వ్యత్యాసం ఉంటుందని పేర్కొంది. గతేడాది కాలంగా పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు కంపెనీపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి.

కాబట్టి ధరల పెంపు ద్వారా అదనపు వ్యయాల్లో కొంత మొత్తాన్ని కస్టమర్లపై మోపడం ఆవశ్యకంగా మారిందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ వెల్లడించింది. ధరల పెంపు జనవరి 2022లో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. మోడళ్లను బట్టి ధరల పెంపుతో వ్యత్యాసం ఉంటుందని కంపెనీ వివరించింది. కాగా మారుతీ సుజుకీ ఇండియా దేశంలో హ్యాచ్‌బ్యాక్‌ ఆల్టో నుంచి ఎస్‌ – క్రాస్‌ ఎస్‌యూవీ కార్లను విక్రయిస్తున్న విషయం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement