కొత్త ఏడాది 2022లో మరోసారి ధరల మోత మోగడం ఖాయంగా కనిపిస్తోంది. భారత్‌లో బడా మాన్యుఫ్యాక్చరింగ్, కన్స్యూమర్ గూడ్స్ కంపెనీలు రానున్న కొన్ని నెలల్లో ధరల పెంపును పరిశీలిస్తున్నాయి. 2021లో ఇప్పటికే రెండుసార్లు ధరలు పెరిగాయి. అయితే అధిక ఇన్‌పుట్, లాజిస్టిక్స్ వ్యయాలతోపాటు సప్లయ్ దెబ్బతినడం మార్జిన్లను దెబ్బతీస్తోందని కంపెనీలు చెబుతున్నాయి. రానున్న 3 నెలల్లో 4-10 శాతం వరకు ధరలు పెరగొచ్చని ఎఫ్‌ఎంసీ జీ(ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్) కంపెనీలు చెబుతున్నాయి. సేల్స్ తగ్గేందుకు అవకాశం ఉన్నా ధరల పెంపు ఉంటుందని కంపెనీలు చెబుతున్నాయి. మరోవైపు కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ కంపెనీలు ఈ నెలలోనే రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు, ఎయిర్-కండీషనర్ల ధరలను 3-5 శాతం మేర పెంచాయి.
వచ్చే నెలలో మరో రౌండ్‌లో 6-10 శాతం మేర ధరలు పెంచాలనుకుంటున్నాయి. జవవరిలో కూడా ధరలు పెరిగితే డిసెంబర్ 2020 నుంచి నాలుగుసార్లు ధరలు పెంచినట్టవుతుంది. మరోవైపు వాహన తయారీ కంపెనీలు సైతం ధరల పెంపును ప్రకటించాయి. జవనరి నుంచి పెరిగిన రేట్లు అమల్లోకి వస్తాయని అత్యధిక కంపెనీలు వెల్లడించాయి. ఏడాదిలోపే క్రూడ్, పామ్ ఆయిల్, ప్యాకేజింగ్ వ్యయాలు దాదాపు రెట్టింపు అవ్వడంతో ధరలు పెరిగాయి. ముడిప దార్థాల ధరలు పెరిగిపోవడమే ఇందుకు కారణమని కంపెనీలు పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital