ప్రికాషన్ డోస్ విషయంలో కేంద్ర ప్రభుతం క్లారిటీ ఇచ్చింది. ఈ డోసు ఎప్పుడు తీసుకోవాలనే విషయంలో చాలా మంది గందరగోళానికి గురవుతున్నట్టు వివరించింది. రెండో డోసు తీసుకున్న తరువాత 9 నెలలకు ప్రికాషన్ డోస్ తీసుకోవాలని ఇంతకుముందే సూచించామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రికాషన్ డోసు లేదంటే బూస్టర్ డోస్‌గా వ్యవహరించే ఈ టీకా వ్యవధిని 6 నెలలకు తగ్గించాలని కొందరు ప్రభుతానికి సూచించారని వివరణ ఇచ్చింది. అయితే డోస్ కాల వ్యవధిలో ఎలాంటి మార్పు చేయలేదని స్పష్టం చేసింది. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారమే.. రెండో డోసు తీసుకున్న 9 నెలల తరువాతే బూస్టర్ డోస్ తీసుకోవాలని తేల్చి చెప్పింది. 6 నెలల తరువాత బూస్టర్ డోసు తీసుకునేందుకు అర్హులు కారని వివరించింది. కరోనా కట్టడిలో భాగంగా తొలి రెండు డోసులను కేంద్ర ప్రభుతం దేశ వ్యాప్తంగా ఉచితంగా అందించిందని తెలిపింది. జనవరి 10 నుంచి మూడో డోస్ పంపిణీ ప్రారంభించింది.
ఫ్రంట్‌లైన్ వారియర్స్ అయిన్ హెల్త్ వర్కర్లతో పాటు 60 ఏళ్లు పైబడి ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ప్రికాషన్ డోస్ కూడా ఫ్రీగానే అందించింది. 18 ఏళ్లు పైబడిన వారు మాత్రం ఏప్రిల్ 10 నుంచి బూస్టర్ డోసు వేయించుకోవచ్చని తెలిపింది. అయితే డోస్ మాత్రం కేవలం ప్రైవేటు సెంటర్స్‌లోనే అందుబాటులో ఉంది. దీంతో అవసరం ఉన్నవారు.. నిర్ణీత ఫీజు చెల్లించి ప్రికాషన్ డోసు తీసుకోవాల్సి ఉంటుంది. కొవిషీల్డ్‌తో పాటు కొవాగ్జిన్ డోస్‌గా ఇస్తున్నారు. తొలి రెండు ఏ వ్యాక్సిన్ తీసుకుంటే మూడో డోసు కూడా అదే ఉండాలి. దీని కోసం ధరను రూ.225గా నిర్ణయించింది. సరీస్ చార్జీ పేరుతో.. ఆయా సెంటర్లు గరిష్టంగా రూ.150 వసూలు చేసుకోవచ్చనే అభిప్రాయాన్ని తెలియజేసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..