Monday, November 25, 2024

Telangana | ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కాస్త‌.. ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ బీజేపీగా మారింది: రెడ్కో చైర్మ‌న్‌

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కాస్త ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ బీజేపీ, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరోగా మారింద‌ని విమ‌ర్శించారు రెడ్కో చైర్మ‌న్ వై. స‌తీష్‌రెడ్డి. హైదరాబాదులో జరిగిన ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో చాలా పెద్ద తప్పు చేసింద‌న్నారు. వాట్సాప్ యూనివర్సిటీ ఫేకుడును PIB మించిపోయింద‌ని తెలిపారు. నిజానికి ఫార్ములా ఇవ్వాల (శ‌నివారం) విజేత జియాన్ ఎరిక్ కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ బహుమతి అందజేశారు. కానీ కేంద్ర సమాచార ప్రసార శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలంగాణ విభాగానికి ఇది కనిపించక పోవడం బాధాకరం. కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ విజేతకు బహుమతి అందజేసినట్టుగా తన అఫీషియల్ ట్విట్టర్ పేజీలో PIB – TELANGANA ట్వీట్ చేసింది.

ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు సమాచారం చేరవేసేందుకు కేంద్ర ప్రభుత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోని కూడా BJP కాషాయీకరణ చేసింద‌ని స‌తీష్‌రెడ్డి ఆక్షేపించారు. పూర్తిగా బీజేపీ అనుకూల వార్తలు వాట్సాప్ యూనివర్సిటీ మాదిరి ఫేక్ వార్తలు పోస్ట్ చేసేలా అక్కడ పనిచేసే సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంద‌న్నారు.
ఎవరు మంచి పని చేసినా తమ ఖాతాలో వేసుకోవడం బీజేపీకి అలవాటైన పని. ఫార్ములా ఈ రేస్ చూసేందుకు వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇదే విధంగా మాట్లాడటం సిగ్గుచేటుమానుకోవాలా అన్నారు..

కేంద్రం వల్లే.. కేంద్ర సహకారం వల్లే హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ జరిగిందంటూ కిషన్ రెడ్డి మాట్లాడటం ఆయన అవేకానికి నిదర్శనం అని పేర్కొన్నారు. ఎన్నో దేశాలు, ఎన్నో పట్టణాలు పోటీపడినా రాష్ట్ర ప్రభుత్వ చొరవ మంత్రి కేటీఆర్ నిరంతర కృషితో ఫార్ములా ఈ రేస్ హైదరాబాదులో జరిగింద‌ని, ఈ విషయం కూడా తెలియకుండా కిషన్ రెడ్డి అంతా తామే చేశామని డబ్బా కొట్టుకోవడం BJP ఫేకుడుకు నిదర్శనంగా నిలుస్తుంద‌న్నారు. ఇకనైనా బీజేపీ నేతలు బుద్ధి మార్చుకోవాలని, మందికి పుట్టిన పిల్లల్ని త‌మ‌ పిల్లలు అని చెప్పుకోవ‌డం మానుకోవాలని హిత‌వుప‌లికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement