సంక్షోభంతో కొట్టుమిట్టాడిన శ్రీలంకలో పలు మార్పులు చోటు చేసుకున్న అనంతరం మళ్లీ నేడు శ్రీలంక అధ్యక్ష భవనాన్ని ఓపెన్ చేశారు.ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో నిరసనకారులు ఆ భవనాన్ని చుట్టుముట్టిన విషయం తెలిసిందే. ఆందోళనకారులు అధ్యక్ష భవనాన్ని ముట్టడించడానికి ముందు మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం విడిచి వెళ్లారు. అయితే గత శుక్రవారం భారీ స్థాయిలో మిలిటరీ ఆ భవనాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. ప్రెసిడెన్షియల్ సెక్రటేరియేట్ వద్ద రెయిడ్ నిర్వహించారు. గల్లే ఫేస్ నిరసన ప్రదేశంలోనూ సైన్యం సోదాలు నిర్వహించింది. అనేక మందిని ఆర్మీ అరెస్టు చేసింది. అయితే కొత్త అధ్యక్షుడు రాణిల్ విక్రమసింఘేకు వ్యతిరేకంగా కూడా నిరసనకారులు ఆందోళన చేస్తున్నారు. వారిని అదుపు చేసేందుకు అదనపు బలగాలు మోహరించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement