Friday, November 22, 2024

President of India – త్రివిధ దళపతి గుర్రపు బగ్గీ సవారీ…

న్యూఢిల్లీ – 300 ఏళ్లు పీడించిన బ్రిటీష్ పాలకులను అహింసాయుధంతో తరిమేసిన భారతీయుల ప్రతినిధిగా,,, బ్రిటీష్ పాలకుల నుంచి గుంజుకున్న గుర్రపు బగ్గీపై చట్టసభలకు తరలి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మ భరత జాతి ఆత్మ గౌరవాన్ని చాటారు. వందల ఏళ్లు భారతీయుల శ్రమను దోచుకుని రాచరికం..అరాచకంతో సుఖభోగాలను అనుభవించిన పరాయి దేశాధినేత ఊరేగిన గుర్రపు బగ్గీలో.. యావత్ భారత దేశ ప్రజల ప్రతినిధిగా …ఈ గుర్రపు బగ్గీ హక్కు భుక్తం భారతీయులదేనని రాష్ర్టపతి ద్రౌపది ముర్మా నిరూపించిన వైనం నేపథ్యం ఇది. దేశభక్తి నినాదంతో ఐదేళ్లు దేశాన్ని పాలించిన కేంద్ర ప్రభుత్వం చివరి పార్లమెంటు సభలు బుధవారం ప్రారంభం కాగా.. ఓ గుర్రపు బగ్గీపై రాష్టపతి ద్రౌపది ముర్మ పార్లమెంటుకు చేరుకున్నారు. మరో విషయం ఇటీవల జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ బుల్లెట్‌ ప్రూఫ్‌ కాన్వాయ్‌లో కాకుండా సంప్రదాయ బగ్గీలో రాష్ట్రపతి భవన్‌ నుంచి కర్తవ్య పథ్‌కు చేరుకున్నారు.

గుర్ర‌పు బ‌గ్గీ వినియోగించ‌డం ఎందుకంటే..
భారత రాష్ట్రపతి గణతంత్ర వేడుకల్లో గుర్రపు బగ్గీని వినియోగించడం వెనుక కథెంటీ? అని నేటి నవతరం ఆలోచనలో పడింది. మెదడులో స్టోరీ రికవరీకి నానా తంటాలు పడింది. ఇంతకీ ఈ చారిత్రాత్మక నేపథ్యం ఏమిటంటే.. 40 ఏళ్ల తర్వాత తొలిసారి గుర్రపు బగ్గీ ప్రత్యక్షం వెనుక అసలు కథ.. ఆసక్తికరం. బ్రిటిష్‌ పాలనా కాలంలో భారత దేశ వైస్రాయ్ దీన్ని ఉపయోగించారు. అప్పటి వైస్రాయ్‌ ఎస్టేట్‌ (ప్రస్తుత ప్రెసిడెన్షియల్‌ ఎస్టేట్‌)లో ఈ బండిలో విహరించారు. బ్రిటిష్‌ పాలన అంతమై, భారత్‌, పాకిస్థాన్‌ వేర్వేరు దేశాలుగా విడిపోగా.. ఈ విలాసవంత బగ్గీ పోటీ జరిగింది. దీన్ని దక్కించుకోవడానికి భారత్‌, పాక్‌ పేచీకి దిగాయి. చివరికి ఓ నాణేన్ని ఎగురవేసి, అదృష్టం ఎవరిని వరిస్తే వారిదే ఈ బగ్గీ అనే రాజీ మార్గానికి వచ్చారు. భారత దేశ కర్నల్‌ ఠాకూర్‌ గోవింద్‌ సింగ్‌, పాకిస్థాన్‌ కర్నల్‌ సాహబ్‌జాదా యాకూబ్‌ ఖాన్‌ నాణేన్ని ఎగురవేశారు. ఇలా బొమ్మా బొరుసా పోటీలో అదృష్టం భారత్‌ను వరించింది. దీంతో ఈ బండి భారత్‌కు లభించింది. ఇలా బ్రిటీష్ పాలకులను తరమటమే కాదు.. దాయాదుల ఉక్రోషానికి గుర్తుగా మిగిలిన ఈ గుర్రపు బగ్గీపై యానం .. యావత్ భారతావని ప్రజానీకం ఆత్మగౌరవం సూచికగా.. రాష్ర్టపతి వినియోగించటం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement