Thursday, July 4, 2024

UP | హాథ్రస్ ఘ‌ట‌న‌పై.. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

ఉత్తరప్రదేశ్ లోని హాథ్రస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి భారీగా ప్రాననష్టం సంభవించడంపై రాష్ట్రపతి, ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట హృదయ విదారకకం : రాష్ట్రపతి ముర్ము

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాటలో భక్తులు మృతి చెందడం హృదయ విదారకకం అని రాష్ట్రపతి ముర్ము అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను: ప్రధాని మోదీ

హత్రాస్ జిల్లాలో తొక్కిసలాట, భక్తులు మృతి చెందడం బాధాకరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మృతుల కుటుంబాలను సంతాపం తెలిపిన ఆయన, గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్‌కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నానని… బాధితులందరినీ అన్ని విధాలుగా ఆదుకునేందుకు యూపీ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement