భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మ ప్రధాని మోదీకి లేఖరాశారు. అయోధ్య శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ప్రధానికి ఈ లేఖ రాశారు. 11 రోజులుగా ఎంతో నిష్ఠగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
శ్రీరాముడు సాహసం, కరుణ, కర్తవ్య నిష్ఠకు ప్రతీక అని అన్నారు. మన సంస్కృతి, ఆధ్యాత్మికత రాముడి జీవితంతో ముడిపడి ఉందని రాష్ట్రపతి లేఖలో పేర్కొన్నారు. జాతి నిర్మాతలకు రామాయణం ఎంతో ప్రేరణగా నిలిచిందని అన్నారు. సత్యనిష్ఠ గొప్పతనం రాముడి వల్లే గ్రహించానని గాంధీ అన్నారని, సుపరిపాలన అంటే ఇప్పటికీ రామరాజ్యమే గుర్తుకొస్తుందని, అయోధ్య కార్యక్రమంతో దేశమంతా పండుగ వాతావరణం నెలకొందని రాష్ట్రపతి ముర్ము అన్నారు.