Saturday, November 23, 2024

8 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యం సేకరణకు సిద్ధం.. తెలంగాణకి కేంద్రం లేఖ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రం నుంచి మరో 8 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యాన్ని సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ లేఖ ద్వారా స్పష్టం చేసింది. 2021-22 సంవత్సరానికిగానూ రబీ సీజన్‌లో ఎఫ్‌సీఐ ద్వారా పోషకాలు జతచేసిన 8 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యాన్ని సేకరించనుంది. ఇప్పటికే తెలంగాణలో 6.05 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యాన్ని కేంద్రం సేకరించింది.

ఎఫ్‌సీఐ వద్ద మూడేళ్లకు సరిపడా ఉప్పుడు బియ్యం నిల్వలు ఉన్నప్పటికీ తెలంగాణ రైతాంగం ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి గురువారం వెల్లడించారు. తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందన్న ఆయన, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement