Saturday, November 23, 2024

ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌కు ఆసియా ఫెడరేషన్‌ మద్దతు

భారత్‌ వేదికగా తొలిసారి నిర్వహిస్తున్న ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌ (పిహెచ్‌ఎల్‌)కు ఆసియా హ్యాండ్‌బాల్‌ ఫెడరేషన్‌ మద్దతు తెలిపింది. ఈ మేరకు దక్షిణాసియా బ్యాండ్‌బాల్‌ ఫెడరేషన్‌కు, బ్లూ స్పోర్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మధ్య వాణిజ్యపరమైన ఒప్పందానికి ఆమోదం లభించిందని తెలిపారు. దీనివల్ల భారత్‌లో హ్యాండ్‌బాల్‌ క్రీడకు మరింత గుర్తింపు లభిస్తుందని నిపుణులు తెలిపారు. 20 ఏళ్లపాటు పురుషులు హ్యాండ్‌బాల్‌ గేమ్‌ను ప్రమోట్‌ చేయడానికి ఆ అగ్రిమెంట్‌ హక్కులను కల్పించింది.

ఈ సందర్భంగా బ్ల్యూస్పోర్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మను అగర్వాల్‌, అంతర్జాతీయ హ్యాండ్‌బాల్‌ ఫెడరేషన్‌పై వైస్‌ ప్రెసిడెంట్‌ బడెర్‌ మహ్మద్‌ మాట్లాడుతూ, ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌కు ఇదొక అద్భుత క్షణాలు. పీహెచ్‌ఎల్‌ వ్యవస్థను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతాం. భారత్‌లో ఒలింపిక్స్‌ క్రీడలు నిర్వహించేలా పిహెచ్‌ఎల్‌ మా వంతు కృషి చేస్తాం . ఆసియాలో హ్యాండ్‌బాల్‌ గేమ్‌కు భారత్‌లో మంచి మార్కెట్‌ ఉంది అని అగర్వాల్‌ చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement