Saturday, November 23, 2024

పదో తరగతి విద్యార్థులకు ప్రీఫైనల్‌ ఎగ్జామ్స్‌.. మే 6 నుంచి నిర్వహణ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పదో తరగతి విద్యార్థులకు మే 6 నుంచి 12వ తేదీ వరకు ప్రీఫైనల్‌ పరీక్షలు జరగనున్నాయి. ఈమేరకు ఎస్‌సీఈఆర్‌టీ (రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి) షెడ్యూల్‌ ఖరారు చేస్తూ మంగళవారం ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ ఎం.రాధారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన చర్యలు చేపట్టాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు, ఆర్‌జేడీలకు ఆమె ఆదేశాలు జారీ చేశారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం పరీక్షా విధానాన్ని మార్చిన విషయం తెలిసిందే. గతంలో 11 పేపర్లకు విద్యార్థులు పరీక్ష రాసేవారు.

కానీ కరోనా కారణంగా ప్రభుత్వం 11 పేపర్ల నుంచి 6 పేపర్లకు కుదించిన నేపథ్యంలో విద్యార్థులకు ఈ ఆరు పేపర్లకే ప్రీఫైనల్‌, వార్షిక పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. మే 6న ఫస్ట్‌ లాంగ్వేజ్‌, 7న సెకండ్‌ లాంగ్వేజ్‌, 9న ఇంగ్లీష్‌, 10న మ్యాథమెటిక్స్‌, 11న సైన్స్‌, 12న సోషల్‌ స్టడీస్‌. ఉదయం 8.30 గంటల నుంచి 11.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement