టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నేడు జరుగుతున్న మరో మ్యాచ్‌లో గ్రూప్-బిలోని ఒమన్, స్కాట్లాండ్ జట్లు తలపడుతున్నాయి. కాగా, ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్… నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసి స్కాట్లాండ్ ముందు ఓ మోస్తరు లక్ష్యాన్ని నిర్దేశించింది.
టాస్ గెలిచిన ఒమన్ బ్యాటింగ్ చేపట్టగా.. ఓపెనర్ ప్రతీక్ అథవాలే (54) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. వరుసగా వికెట్లు పడుతున్న నిలకడగా ఆడుతూ జట్టు స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కెప్టెన్ అకీబ్ ఇలియాస్ సులేహ్రీ (6 బంతుల్లో 16 పరుగులు) ఔటయ్యాడు. ఆల్ రౌండర్ అయాన్ ఖాన్ (41 నాటౌట్) రాణించాడు.
ఇక స్కాట్లాండ్ బౌలర్లలో సఫ్యాన్ షరీఫ్ రెండు వికెట్లు తీయగా.. మార్క్ వాట్, బ్రాడ్లీ వీల్, క్రిస్ సోల్, మైఖేల్ అలెగ్జాండర్ లీస్క్, క్రిస్ గ్రీవ్స్ చెరో వికెట్ దక్కించుకున్నారు. దీంతో 151 పరుగుల లక్ష్యంతో స్కాట్లాండ్ జట్టు ఛేజింగ్ ప్రారంభించనుంది.