Tuesday, October 29, 2024

ప్రశాంత్‌ కిషోర్‌ బీజేపీ ఏజెంట్‌: జేడీయూ

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ను ”బీజేపీ ఏజెంట్‌” గా జేడీ(యూ) అభివర్ణించింది. ఆయన కేవలం తనను తాను మార్కెటింగ్‌ చేసుకుంటారని తెలిపింది. బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ఇచ్చిన ఆఫర్‌ను తాను తోసిపుచ్చానంటూ ప్రశాంత్‌ కిషోర్‌ చేసిన వ్యాఖ్యలను జేడీ(యూ) అధ్యక్షుడు రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ అలియాస్‌ లలన్‌ తోసిపుచ్చారు. ఆయన రాజకీయ కార్యకర్త కాదని, వ్యాపారి అని, కేవలం మార్కెటింగ్‌ తంత్రాలపై ఆధారపడతారని అన్నారు.

”కొద్దికాలంగా ప్రశాంత్‌ కిషోర్‌ బీజేపీ తరఫున పని చేస్తున్నారనే విషయం మాకు తెలుసు. బీజేపీ ఏజెంట్‌ ఒకరు ఇటీవల మెజిస్ట్రేట్‌ చెకింగ్‌లో దొరికిపోయారు” అని పరోక్షంగా పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు ఆర్‌సీపీ సింగ్‌ను ఉద్దేశించి లలన్‌ సింగ్‌ అన్నారు. నితీష్‌ను కలిసినట్టు పీకేనే స్వయంగా మీడియాకు చెప్పారని, అయితే వాళ్లు బీజేపీకి పనిచేస్తున్నారనే విషయం తమకు బాగా తెలుసునని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement