దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు వచ్చిన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరు అక్కడ వినపడుతుంది. ఈ మధ్య దేశరాజకీయాలపై దృష్టిపెట్టిన ప్రశాంత్ కిషోర్…ఇప్పుడు ఓ పదవికి రాజీనామా చేశారు. పంజాబ్ సీఎం ప్రధాన సలహాదారుడిగా పనిచేస్తున్న పీకే ఇప్పుడు ఆ పదవికి రాజీనామా చేశారు. ప్రజా జీవితంలో క్రియాశీల పాత్ర నుంచి కొన్ని రోజులు విరామం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నానని, అందుకే తాను పదవి నుంచి తప్పుకుంటున్నట్టు సీఎం అమరీందర్ సింగ్‌కు లేఖ రాశారు.
2014లో బీజేపీ తరపున ఎన్నికల వ్యూహాలను రచించిన పీకే ఆ తరువాత బీజేపీకి వ్యతిరేకంగా వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో వ్యూహకర్తగా వ్యవహరించారు. గతంలో బీహార్ ఎన్నికల్లో నితీష్ కుమార్ పార్టీ జేడీయు తరపున వ్యూహకర్తగా వ్యవహరించిన తరువాత ఆయనకు పార్టీ ఉపాధ్యక్ష పదవిని అప్పగించారు. ఆ తరువాత జేడీయు బీజేపీతో చేతులు కలపడంతో ప్రశాంత్ కిషోర్ ఆ పార్టీ నుంచి పక్కకు తప్పుకున్నారు. ఇప్పుడు ఇప్పుడు అమరీందర్ సింగ్ ప్రధాన సలహాదారుడి పదవి నుంచి కూడా తప్పుకోవడంతో నెక్ట్స్ ఏం చేయబోతున్నారని దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొన్నది. ప్రధాన సలహాదారుడిగా రాజీనామా చేసిన తరువాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే, దీనిపై అటు ప్రశాంత్ కిషోర్‌గాని, కాంగ్రెస్ అధిష్టానం గాని ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
ఇది కూడా చదవండి: ఆచార్య బ్యాలన్స్ సాంగ్ షూట్ పై లేటెస్ట్ అప్డేట్ !!