Sunday, January 12, 2025

TG | ప్రణయ్ హత్య కేసు.. నకిలీ పత్రాలతో సుభాష్ బెయిల్ !

  • మొగ్గురు అరెస్ట్

సంచలనం సృష్టించిన ప్రణయ్‌ పరువు హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రణయ్‌ను దారుణంగా నరికి చంపిన ప్రధాన నిందితుడు సుభాష్‌ బెయిల్‌ కోసం నకిలీ షూరిటీలు సమర్పించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఫేక్‌ షూరిటీలు సమర్పించిన ముగ్గురిని మిర్యాలగూడ పోలీసులు అరెస్ట్‌ చేసి చేశారు. నిందితులకు న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించారు.

2018లో జరిగిన ప్రణయ్‌ పరువు హత్య సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన వ్యాపారవేత్త మారుతీరావు కుమార్తె అమృతను మరో సామాజిక వర్గానికి చెందిన ప్రణయ్‌ లవ్‌ మ్యారేజ్‌ చేసుకున్నాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మారుతిరావు బీహార్‌కు చెందిన సుభాష్‌ శర్మకు సుపారీ ఇచ్చి ప్రణయ్‌ని దారుణంగా హత్య చేయించాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సుభాష్‌ శర్మ బెయిల్‌పై విడుదల కాగా, బెయిల్‌పై బయటకు వచ్చిన మారుతిరావు హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement