డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌లో ఇవ్వాల (సోమవారం) జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ లో ఇండియన్ స్టార్ షట్లర్లు హెచ్‌ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్ ఫిన్‌లాండ్‌కు చెందిన కల్లె కోల్జోనెన్, మారిషస్‌కు చెందిన జార్జెస్ జూలియన్ పాల్‌పై వరుస గేమ్‌లతో గెలిచి రెండో రౌండ్‌కు చేరుకున్నారు.
గత రెండు ఎడిషన్‌లలో క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్న ప్రపంచ 9వ ర్యాంకర్ ప్రణయ్, కోల్జోనెన్‌ను 24-22, 21-10తో ఓడించాడు. ఇక, ప్రస్తుత కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత అయిన సేన్, 25 నిమిషాల్లో పాల్‌ను 21-12, 21-7తో గెలిచాడు. 2021 ఎడిషన్‌లో కాంస్యం గెలిచిన లక్ష్య సేన్ షట్లర్ కొరియాకు చెందిన జియోన్ హ్యోక్ జిన్‌తో కలిసే అవకాశం ఉంది, కేరళకు చెందిన ప్రణయ్ ఇండోనేషియాకు చెందిన చికో ఔరా ద్వి వార్డోయోతో తలపడే అవకాశం ఉంది.
అంతకుముందు, భారత మిక్స్‌డ్ డబుల్స్ జోడీ రోహన్ కపూర్-ఎన్ సిక్కి రెడ్డి, స్కాట్లాండ్‌కు చెందిన ఆడమ్ హాల్, జూలీ మాక్‌ఫెర్సన్‌ల చేతిలో 59 నిమిషాల పాటు జరిగిన పోరులో 14-21, 22-20, 18-21 తేడాతో ఓడిపోయారు.