Tuesday, November 19, 2024

Prajwal Revanna | మే 31న సిట్​ ముందు హాజరవుతా..

లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని హాసన్ లోక్‌సభ నియోజకవర్గం ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ భారత్‌కు తిరిగి వస్తానని చెప్పారు. ఈనెల 31న సిట్ ఎదుట హాజరవుతానని.. విచార‌ణకు పూర్తిగా సహకరిస్తానని వెల్లడించారు. ఈ మేరకు (సోమవారం) ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రజ్వల్ తన తాత (మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ), తల్లిదండ్రులు, పార్టీ కార్యకర్తలకు క్షమాపణలు చెప్పారు.

“ఏప్రిల్ 26న ఎన్నికలు జరిగినప్పుడు నాపై ఎలాంటి కేసు లేదు. సిట్​ ఏర్పాటు కాలేదు. నా విదేశీ పర్యటన ముందస్తు ప్రణాళికలో భాగమే. 2-3 రోజుల తర్వాత నేను నా పర్యటనలో ఉన్నప్పుడు న్యూస్​ పేపర్ల ద్వారా నాపై ఆరోపణలు వచ్చినట్లు తెలిసింది. సిట్​ కూడా నాకు నోటీసు అందించింది. ఆ నోటీసుకు కూడా నేను స్పందించాను. నా అడ్వొకేట్​ ద్వారా ఏడు రోజులు సమయం ఇవ్వాలని కోరాను. మే 31న (శుక్రవారం) నేను స్వయంగా సిట్ ముందు హాజరవుతాను. విచారణకు సంబంధించి పూర్తి వివరాలను అందిస్తాను. విచారణకు పూర్తిగా సహకరిస్తాను. నాకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది. ఈ తప్పుడు కేసు నుంచి బయటపడేందుకు న్యాయపరంగా పోరాడతాను. దేవుడు, ప్రజలు, నా కుటుంబ సభ్యుల ఆశీస్సులు నాపై ఉండాలి.” అని ప్రజ్వల్ రేవణ్ణ అన్నారు.

హాసన్ నియోజకవర్గంలోని కొన్ని శక్తులన్నీ ఏకమై తనపై కుట్ర చేశాయని ప్రజ్వల్​ రేవణ్ణ ఆరోపించారు. న‌న్ను రాజకీయంగా అంతం చేసేందుకు అందరం కలిసి పనిచేశామన్నారు. ఇదంతా చూసి నేను షాక్‌కి గురయ్యాను. ఎవరితోనూ టచ్‌లో లేదు. అందుకు ప్రతి ఒక్కరికీ క్షమాపణలు చెబుతున్నా’’ అని ప్రజ్వల్ రేవణ్ణ వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement