లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని హాసన్ లోక్‌సభ నియోజకవర్గం ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ భారత్‌కు తిరిగి వస్తానని చెప్పారు. ఈనెల 31న సిట్ ఎదుట హాజరవుతానని.. విచారణకు పూర్తిగా సహకరిస్తానని వెల్లడించారు. ఈ మేరకు (సోమవారం) ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రజ్వల్ తన తాత (మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ), తల్లిదండ్రులు, పార్టీ కార్యకర్తలకు క్షమాపణలు చెప్పారు.
“ఏప్రిల్ 26న ఎన్నికలు జరిగినప్పుడు నాపై ఎలాంటి కేసు లేదు. సిట్ ఏర్పాటు కాలేదు. నా విదేశీ పర్యటన ముందస్తు ప్రణాళికలో భాగమే. 2-3 రోజుల తర్వాత నేను నా పర్యటనలో ఉన్నప్పుడు న్యూస్ పేపర్ల ద్వారా నాపై ఆరోపణలు వచ్చినట్లు తెలిసింది. సిట్ కూడా నాకు నోటీసు అందించింది. ఆ నోటీసుకు కూడా నేను స్పందించాను. నా అడ్వొకేట్ ద్వారా ఏడు రోజులు సమయం ఇవ్వాలని కోరాను. మే 31న (శుక్రవారం) నేను స్వయంగా సిట్ ముందు హాజరవుతాను. విచారణకు సంబంధించి పూర్తి వివరాలను అందిస్తాను. విచారణకు పూర్తిగా సహకరిస్తాను. నాకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది. ఈ తప్పుడు కేసు నుంచి బయటపడేందుకు న్యాయపరంగా పోరాడతాను. దేవుడు, ప్రజలు, నా కుటుంబ సభ్యుల ఆశీస్సులు నాపై ఉండాలి.” అని ప్రజ్వల్ రేవణ్ణ అన్నారు.
హాసన్ నియోజకవర్గంలోని కొన్ని శక్తులన్నీ ఏకమై తనపై కుట్ర చేశాయని ప్రజ్వల్ రేవణ్ణ ఆరోపించారు. నన్ను రాజకీయంగా అంతం చేసేందుకు అందరం కలిసి పనిచేశామన్నారు. ఇదంతా చూసి నేను షాక్‌కి గురయ్యాను. ఎవరితోనూ టచ్‌లో లేదు. అందుకు ప్రతి ఒక్కరికీ క్షమాపణలు చెబుతున్నా’’ అని ప్రజ్వల్ రేవణ్ణ వివరించారు.