రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం సాహిత్య, సాంస్కృతిక రంగాలలో విశేష కృషి చేసిన వారికి పద్మవిభూషణ్, ప్రజాకవి కాళోజీ నారాయణరావు పురస్కారాలను అందజేస్తుంది. కాగా, 2024 సంవత్సరానికి గానూ ‘కాళోజీ నారాయణరావు అవార్డు’కు ప్రముఖ సాహితీవేత్త, బహుభాషా కవి, కవి, రచయిత, అనువాదకుడు నలిమెల భాస్కర్ ఎంపికయ్యారు.. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నెల 9న కాళోజీ నారాయణరావు జయంతి వేడుకల సందర్భంగా నిర్వహించే అధికారిక కార్యక్రమంలో భాస్కర్‌కు ‘కాళోజీ’ అవార్డును అందజేయనున్నారు. అవార్డు కింద రూ.1,01,116 నగదుతో పాటు జ్జాపిక అందించి శాలువతో సత్కరించనున్నారు. కాళోజీ అవార్డుకు ఎంపికైన నలిమెల భాస్కర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందించారు.