న్యూజిలాండ్: విశ్వనాథన్ ఆనంద్‌ను అధిగమించి యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద నంబర్ 1 భారత చెస్ ప్లేయర్‌గా నిలిచాడు. తన కెరీర్‌లో అగ్రశ్రేణి క్రీడాకారుడిగా ప్రజ్ఞానంద నిలవడం ఇదే తొలిసారి. టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నీ నాలుగో రౌండ్‌లో ప్రపంచ ఛాంపియన్ డింగ్ లిరెన్ (చైనా)ను ఓడించి ఈ ఘనత సాధించాడు.
ప్రస్తుతం ఫిడే ర్యాంకింగ్స్ ప్రకారం.. ప్రజ్ఞానంద 2748.3 పాయింట్లతో 11, విశ్వనాథన్ 2748తో 12 స్థానంలో కొనసాగుతున్నారు. దీంతో భారత్ తరఫున టాప్ ప్లేయర్‌గా యువ సంచలనం అగ్రస్థానానికి ఎగబాకాడు.