Wednesday, December 18, 2024

Prabhas injured | సినిమా షూటింగ్‌లో ప్రభాస్‌కు గాయం.!

అగ్ర కథానాయ‌కుడు ప్ర‌భాస్ తృటిలో ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకున్నాడు. ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా.. ఆయ‌న గాయ‌ప‌డిన‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం ఆయ‌న విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ విష‌యాన్ని ప్ర‌భాస్ సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించాడు. ఆయ‌న ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వ‌చ్చిన ఈ చిత్రం సూప‌ర్ హిట్‌గా నిల‌వ‌డ‌మే కాకుండా రూ.1100 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.

అయితే ఈ సినిమాను వ‌చ్చే ఏడాది జ‌పాన్‌లో విడుద‌ల చేస్తున్నారు మేక‌ర్స్. జనవరి 3న జపాన్‌లో విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా జ‌పాన్‌లో ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొనాల్సి ఉంది ప్ర‌భాస్. అయితే తాను ఈ వేడుక‌కు రాలేక‌పోతున్నాన‌ని ప్ర‌భాస్ వెల్ల‌డించారు. మీరు నాపై చూపిస్తున్న ప్రేమ‌కు, అభిమానాలకు ధన్యవాదాలు. జ‌పాన్‌లోని అభిమానుల‌ని క‌ల‌వాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నా. కానీ మూవీ షూటింగ్‌లో నా కాలుకు గాయ‌మైంది. దీంతో ఈ జపాన్‌కు రాలేక‌పోతున్న.. ఈ విష‌యంలో న‌న్ను క్షమించండి అంటూ ప్ర‌భాస్ రాసుకోచ్చాడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement