దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉన్న సమయంలో ప్రధాని బోరిస్‌జాన్సన్, ఆయన కుటుంబం, సిబ్బంది కలిసి ప్రధాని కార్యాలయంలోను, ఇంటివద్ద అత్యంత లగ్జరీగా ఆల్కాహాల్ పార్టీలు చేసుకోవడం, ప్రధానమంత్రి పదవికే ఎసరుతెచ్చింది. సొంత పార్టీ సభ్యులే ఆయనపై అవిశ్వాసతీర్మానం ప్రతిపాదించారు. ప్రధానిగా బోరిస్ జాన్సన్ సోమవారం పార్లమెంటులో తన మెజార్టీని నిరూపించుకోవాల్సి ఉంది. కరోనా ఉథృతంగా ఉన్న సమయంలో వైరస్ నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన దేశ ప్రధాని ఆర్భాటంగా పార్టీలు నిర్వహించడం దేశప్రజలకు, ప్రతిపక్షపార్టీలకే కాదు, సొంతపార్టీ ప్రజాప్రతినిధులకు సైతం తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు పదవీగండం ఏర్పడింది. ప్రధాని బోరిస్‌జాన్సన్‌పై సొంతపార్టీ కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులే పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. పార్టీగేట్ కుంభకోణం పేరుతో పిలిచే ఆ పార్టీలకు ప్రధాని బోరిస్ జాన్సన్ తన పదవిని కోల్పోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
బోరిస్ జాన్సన్ 2019లో జరిగిన ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ తరపున గెలిచి ప్రధామంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే, కొవిడ్-19 సమయంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉండగా, డౌనింగ్ స్ట్రీట్ లోని ప్రధాని కార్యాలయంలోనూ, ప్రధాని నివాసంలోను, అత్యంత లగ్జరీగా, ఆల్కాహాల్ పార్టీలను ప్రధాని, ఆయన సిబ్బంది జరుపుకున్నారు. బ్రిటన్ ప్రధాని తీరుపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. సొంత పార్టీ నుంచి కూడా బోరిస్‌జాన్సన్‌కు పార్టీగేట్ కుంభకోణంపై తీవ్ర వ్యతిరేకత, ఆగ్రహం ఎదురైంది. ఇటీవల లండన్‌లో జరిగిన బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజిబెత్ ప్లాటినం జూబ్లిd వేడుకల్లో కుటుంబసమేతంగా పాల్గొన్న బ్రిటన్ ప్రధాని బోరిస్‌కు దేశ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ప్రజలు ఆయనను గేలి చేసి అవమానించారు. మరోవైపు బోరిస్ కేబినెట్‌లో పనిచేసిన పలువురు మాజీమంత్రులు ఆయన తీరును తీవ్రస్థాయిలో తప్పుపట్టారు.
దేశప్రధానిగా బోరిస్ జాన్సన్ కొనసాగడమంటే, ప్రజలను,పార్టీని అవమానించినట్లే అని బోరిస్ కేబినెట్‌లో పని చేసిన మాజీ మంత్రి జెస్సీ నోర్మన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ హెల్త్ మినిస్టర్ జెర్మే హంట్ సైతం ప్రధానిపై తీవ్రవ్యాఖ్యలు చేశారు. మార్పు కోసం ఓటేస్తానని ఆయన ప్రకటించారు. జాన్సన్ కేబినెట్‌లోని యాంటీ కరప్షన్ చీఫ్ జాన్ పెన్‌రోస్ తన పదవికి రాజీనామా చేశారు. బోరిస్‌కు వ్యతిరేకంగా ఓటేస్తానని స్పష్టం చేశారు. కన్జర్వేటివ్ పార్టీకి 359 మంది ఎంపీలు ఉండగా, వారిలో కనీసం 180 మంది ప్రధానికి వ్యతిరేకంగా ఓటేయనున్నారు. ప్రధాని పదవి నుంచి బోరిస్ జాన్సన్‌ను దింపేయనున్నారు. దీంతో, బోరిస్‌జాన్సన్ ఈ అవిశ్వాస తీర్మాన గండం నుంచి గట్టెక్కడమని భావిస్తున్నారు. ఒకవేళ, బోరిస్‌జాన్సన్ విశ్వాసతీర్మానంలో నెగ్గినా, ప్రధానమంత్రిగా కొత్తవ్యక్తిని పార్టీ నిర్ణయిస్తుందని వారు ప్రకటించారు. అయితే, బోరిస్ జాన్సన్ సొంత పార్టీ కన్జర్వేటివ్‌కు చెందిన ప్రతి ఐదుమందిలో ఒకరు బోరిస్‌కు వ్యతిరేకంగా ఓటేస్తామని ప్రకటించారు. అయితే, అవిశ్వాస తీర్మానంలో తనకు అనుకూలంగా ఓటేయమని కోరుతూ పార్టీ ఎంపీలకు బోరిస్ జాన్సన్ లేఖరాశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.