Friday, November 22, 2024

Power War – ఎన్నిక‌ల ఫైట్ కి పార్టీలు రె’ఢీ’

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: రాష్ట్రంలో అసెంబ్లి ఎన్నికలు సమీపిస్తుండడంతో అధికార, విపక్ష పార్టీలు గెలుపే ధ్యేయంగా వ్యూహ, ప్రతివ్యూహాల్లో నిమగ్న మయ్యాయి. వరుసగా మూడోసారి విజయం సాధించి సత్తా చాటేందుకు భారాస పక్కా ప్రణాళి కతో దూకుడుగా వెళ్లేందుకు సమాయత్తం కాగా.. కర్ణాటక ఎన్నికల ఫలితాలతో మంచి ఊపు మీదున్న కాంగ్రెస్‌ ఎన్నికలయ్యే దాక ప్రజలతో ఉండి భారాసను ఢీకొట్టేందుకు ప్రణాళిక రచిస్తోంది. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌తోనే అభివృద్ధి సాధ్యమని, కేంద్రం, రాష్ట్రం లో ఒకేపార్టీ అధికారంలో ఉన్న అన్నిరంగాల్లో దూసుకు పోతున్నాయని, తెలంగాణాలో భాజపాకు అధికారం కట్టబెట్టాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. మూడు ప్రధాన రాజకీయ పక్షాలు అసెంబ్లి ఎన్నికల్లో పాగా వేసేం దుకు ఇప్పటి నుంచే ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని నిర్ణయిం చడంతో తెలంగాణ రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నా యి. తెలంగాణ అసెంబ్లి ఎన్నికలు డిసెంబర్‌లో జరగను న్నాయి. సెప్టెంబర్‌ చివరిలో ఎన్నికల షెడ్యూల్‌ వెలువ డుతుందని భావిస్తున్నారు.

ఈ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్‌ సాధించేందుకు భారాస చీఫ్‌ సీఎం కేసీఆర్‌ ఎప్పటి నుంచో
వ్యూహాలకు పదును పెట్టారు. 2014, 2018లో జరిగిన ఎన్నికల్లో వచ్చిన సీట్లకన్నా ఈ దఫా ఈ సంఖ్య పెరగబోతోం దని, కేసీఆర్‌ ఇటీవల పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలు నిర్వ#హస్తోంది. ఈ ఉత్సవాలను తమకు అనుకూలంగా మలుచుకుని ఎన్నికల్లో లబ్ధి పొందేలా భారాస వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. అసెంబ్లిd ఎన్నికలపై కేసీఆర్‌ ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులకు దిశానిర్ధేశం చేశారు. ఎన్నికలయ్యేవరకు ప్రజల్లోనే ఉండాలని #హుకూం జారీ చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొం టున్న ఎమ్మెల్యేలను ఎటువంటి పరిస్థితిలో నూ ఉపేక్షించేది లేదని హెచ్చరించిన కేసీఆర్‌ ఎన్నికల్లో కొందరు సిట్టింగ్‌లకు టికెట్లు ఇవ్వడం అనుమానమేనన్న సంకేతాలిచ్చారు.

కార్యవర్గ సమావేశాలతో కాంగ్రెస్‌, భాజపా బిజీ బిజీ
మరో వైపు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల పేరుతో కాంగ్రెస్‌, భాజపాలు అసెంబ్లి ఎన్నికల శంఖారావాన్ని పూరించాయి. రెండు పార్టీల అగ్రనేతలు సోమవారం ఇక్కడ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను నిర్వహంచి ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలే తెలంగాణలోనూ పునరావృతం అవుతాయన్న ధీమాతో కాంగ్రెస్‌ పార్టీ ఉండగా, అటువంటిదేమీ ఉండదని, భాజపా ఒంటరిగా బరిలోకి దిగి అధికారాన్ని కైవసం చేసుకుంటుందని భాజపా చీఫ్‌ బండి సంజయ్‌ చెప్పారు.

30శాతం కమీషన్‌ అంశంతో ప్రజల్లోకి కాంగ్రెస్‌
కర్ణాటకలో భాజపా అవినీతిని ఎండగట్టి ఏ విధంగా అక్కడ అధికారంలోకి వచ్చామో తెలంగాణలోనూ భారాస 30శాతం అవినీతికి పాల్పడుతూ ప్రజల జేబులకు చిల్లు పెడుతున్న అంశాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్యవంతులను చేయాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. కేసీఆర్‌, బీజేపీ తెరచాటు స్నేహాన్ని ప్రజలకు వివరించాలని ప్రతిపాదించింది. రాష్ట్రంలోని సమస్యలపై అన్ని స్థాయిల్లో పోరాట కార్యక్రమాలు చేపట్టాలన్న నిర్ణయాన్ని కాంగ్రెస్‌ తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌ నాయకులందరూ సిద్ధంగా ఉండాలని కార్యవర్గ సమావేశంలో నేతలు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ పట్ల క్షేత్ర స్థాయిలోని ప్రజల్లో విశ్వాసం కల్పించాలని, పార్టీ పదవుల్లో ఉండి కూడా పని చేయని వాళ్ళపై చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. బాధ్యత ఇచ్చిన తర్వాత కూడా పని చేయలేకపోతే.. పని చేయలేమని చెప్పేయండి. బాధ్యతలను విస్మరిస్తే ఏ మాత్రం ఉపేక్షించేది లేదు. పార్టీ కోసం పని చేయని వారిని పక్కన పెట్టేద్దాం. కష్టపడ్డ వారికి మాత్రమే టికెట్లు వస్తాయి. సర్వేల ఆధారంగా టికెట్ల వస్తాయి. పార్టీలోని కీలక నాయకులతో పరిచయాలు ఉన్నంత మాత్రాన టికెట్లు రావు’ అంటూ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణిక్‌ రావ్‌ ఠాక్రే గట్టిగా హచ్చరికలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్వ హంచే సర్వేలు ఆధారంగా… గెలిచే అవకాశాలున్న వారికి మాత్రమే రానున్న ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని కాంగ్రెస్‌ ప్రకటించింది. పెద్ద నేతలతో పరిచయాలుంటే టికెట్లు రావని కాంగ్రెస్‌ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ ఠాక్రే స్పష్టం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -

కర్ణాటకలో 40శాతం సర్కార్‌ నినాదంతో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించిన కాంగ్రెస్‌… తెలంగాణలోనూ అదే ఫార్ములాను అనుసరించాలని తీర్మానించింది. 30 శాతం కమీషన్‌ సర్కార్‌ నినాదాన్ని జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లి కేసీఆర్‌ ప్రభుత్వా న్ని సాగనంపాలని నిర్ణయించింది. జిల్లా అధ్యక్షులకు సర్వా ధికారాలు కట్టబెట్టాలని పీసీసీ నిర్ణయించింది. ఈ నెలాఖరు లోపు మండల, జిల్లా కమిటీల నియమాకాలను పూర్తిచేయా లని ప్రతిపాదించింది. కర్ణాటకలో విజయవంతమైన వ్యూహాన్ని తెలంగాణలోనూ అనుసరించాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. కర్ణాటకలో ఫలించిన నాయకుల ఐక్యత, సమష్టి కృషి, సామాజిక న్యాయం, ముందస్తు ప్రచార వ్యూహాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని పీసీసీ భావిస్తోంది. నాయకుల మధ్య సఖ్యత పెంచేందుకు పార్టీ పెద్దలు రంగంలోకి దిగనున్నారు.

భాజపా యంగ్‌ తరంగ్‌
తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా భాజ పా భారీ ప్రణాళికలు రచిస్తోంది. అసెంబ్లి ఎన్నికలు జరుగను న్న నేపథ్యంలో ఆ పార్టీ వేగం పెంచింది. ఎన్నికల్లో ప్రధాన ప్రచార అస్త్రాలపై కమలనాథులు ఇప్పటికే ఒక స్పష్టతకు వచ్చినట్టు సమాచారం. యువతను తమవైపు తిప్పుకునే లక్ష్యంతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు, అభి వృద్ధి కోసం డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అన్న ప్రధాన నినాదాలతో అసెంబ్లి ఎన్నికలకు వెళ్లాలని ఆ పార్టీ నేతలు సూత్రప్రాయంగా నిర్ణయించారు. సోమవారం ఇక్కడ జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఆ మేరకు కీలక అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. రాష్ట్ర నేతలతోపాటు పలువురు జాతీయ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. 9 ఏళ్ల పరిపాలనలో ప్రధాని మోడీ సాధించిన విజయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇందుకోసం మే 30 నుంచి జూన్‌ 30 వరకు ‘మహాజన్‌ సంపర్క్‌ అభియాన్‌’ కార్యక్రమం చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ఇంటింటికీ బీజేపీ, బహరంగ సభలు, మేధావులు, ఇతర వర్గాలను కలవడం, పోలింగ్‌ బూత్‌ నుంచి పార్లమెంట్‌ స్థాయి వరకు అనేక కార్యక్రమాలను నిర్వహస్తారు.

కొలువులు కావాలంటే కమలం రావాల్సిందే..
అర్హత ఉన్న యువతీయువకులందరికీ ఉద్యోగాలు కల్పించడానికి బీజేపీకి ఓటు వేయాలన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్లేందుకు భాజపా వ్యూ#హం రచిస్తోంది. కొలువులు కావాలంటే కమలం రావాలని, రాష్ట్ర యువత బీజేపీ వైపు నిలవాలని కోరనుంది. బీజేపీ అధికారంలోకి వస్తే పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉచితంగా విద్య, వైద్యం అందిస్తామని ప్రకటించనుంది. ఖాళీగా ఉన్న 25 వేలకు పైగా టీచర్‌ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న భరోసాను ఇవ్వనున్నట్టు సమాచారం. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టనుంది.

డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తోనే అభివృద్ధి..
తెలంగాణ ఎన్నికల్లో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బీజేపీ నిర్ణయించింది. బీజేపీతోనే తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుం దని ప్రచారం చేయనున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ఉంటే.. డబుల్‌ ప్రయోజనాలు రాష్ట్రానికి చేకూరుతాయని వివరించనుంది. రెండు చోట్లా ఒకే ప్రభుత్వం ఉంటే.. కేంద్రం లోని పథకాలు రాష్ట్ర ప్రజలకు చేరువవుతాయన్న ప్రచారం చేయనుంది. రైతులకు, పేద ప్రజలకు, నిరుద్యోగులకు మేలు జరగాలంటే ఈసారి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి తీసుకు రావాలని ప్రజలను అభ్యర్థించనుంది. బీఆర్‌ఎస్‌- కాంగ్రెస్‌ ఒక్కటే అనే అంశాన్ని పెద్దఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని భాజపా భావిస్తోంది. దుబ్బాక, హుజూరాబాద్‌, మునుగోడులో ఉపఎన్నికల్లో డిపాజిట్‌
కూడా రాని కాంగ్రెస్‌ ఎట్టిపరిస్థితుల్లోనూ బీఆర్‌ఎస్‌కు ప్రత్యా మ్నాయం కాదన్న విషయాన్ని ప్రజలకు వివరించి చెప్పాలని భావిస్తోంది. కాగా అసెంబ్లిఎన్నికల నేథ్యంలో జూన్‌ మాసం లో రెండు భారీ బ#హరంగ సభలను నిర్వ హంచాలని భాజపా ప్రతిపాదించింది. ఓ సభకు అమిత్‌షా, మరోసభకు జేపీ నడ్డా హాజరవుతారని తెలుస్తోంది. ఈసారి తెలంగాణలో సింగిల్‌గా నే అధికారంలోకి వస్తామని భాజపా ధీమాతో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement