వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం వకీల్ సాబ్. బాలీవుడ్ లో అమితాబ్ నటించిన పింక్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాగా ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ శిల్పకళావేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నేను బండ్ల గణేష్ లా మాట్లాడలేను. మూడు సంవత్సరాలు సినిమా చేయలేదు అనే భావన కూడా నాలో కలగలేదు. ఎందుకు అంటే నా గుండె ఎప్పుడూ దేశం కోసం మీ అభిమానుల కోసం కొట్టుకుంటుంది. నేను సినీ ఇండస్ట్రీకి వచ్చి 24 సంవత్సరాలు అవుతుంది. ఆ విషయం కూడా నాకు తెలియలేదు. ఇక తెలుగు ఇండస్ట్రీలో మహోన్నతమైన స్థానం సంపాదించుకున్న నిర్మాత దిల్ రాజు తో సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు కలలు కనే వ్యక్తులు అంటే ఎంతో ఇష్టం. ఎప్పటికైనా ఏదో సాధిస్తాను ఓ స్థాయికి వెళ్తాను అనే వ్యక్తి దిల్ రాజు అని అన్నారు పవన్.
ఇక వేణు శ్రీరామ్ విషయానికి వస్తే నా తండ్రి ఓ పోలీస్ కానిస్టేబుల్. ఆ స్థాయి నుంచి పైకి వచ్చాము మేము. కాబట్టి మాకు ఏ వృత్తి ఎక్కువ కాదు. ఏ వృత్తి తక్కువకాదు. వేణు శ్రీరామ్ కూడా చాలా చిన్న స్థాయి నుంచి పైకి ఎదిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి సినిమా చేయడం అంటే అతని స్వశక్తితో తను సంపాదించుకున్నదే. ఇలాంటి దర్శకుడి దగ్గర నటించడం నేను అదృష్టం గా భావిస్తున్నానని అన్నారు పవన్. నాకు న్యాయవాదులు అంటే ఎంతో గౌరవం. అలాంటి ఓ పాత్రలో నటించే అవకాశం వకీల్ సాబ్ ద్వారా లభించిందని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్.