హైదరాబాద్: 24 గంటల ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పేటేంట్ అని టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.. అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉచిత విద్యుత్‌పై తాను చేసిన వ్యాఖ్యలను బిఆర్ఎస్ నేతల వక్రీకరించారని అన్నారు.. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మా ట్లాడుతూ.. 2004, 2009 లో ఉచిత విద్యుత్ నినాదంతోనే వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారని వివరిస్తూ, వైఎస్ అధికారంలోకి రాగానే తొలి సంతకం ఉచిత విద్యుత్ పైనే చేశారని గుర్తు చేశారు..తాజా ఘటనలో ఐటీ మంత్రి కేటీఆర్ తనకున్న ఐటీ నైపుణ్యంతో తాను వేర్వేరుగా మాట్లాడిన మాటలను ఎడిట్ చేసి తప్పుదారి పట్టించారన్నారు . ఉచిత విద్యుత్‌పై ప్రభుత్వ పెద్దలతో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు… రైతులకు ఉచిత విద్యుత్‌ను తీసుకువచ్చిందే కాంగ్రెస్ పార్టీ అంటూ బషీర్‌బాగ్ కాల్పుల ఘటన జరిగినప్పుడు కేసీఆర్ తెలుగుదేశం పార్టీలో ఉన్నారని గుర్తు చేశారు.
ఉచిత విద్యుత్ ఇవ్వడం కుదరదు అని ఆనాడు కేసీఆర్ తెదేపా ప్రభుత్వంతో చెప్పించారంటూ ఆరోపించారు. . సాగుకు 9గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని,. ఉచిత విద్యుత్‌తో పాటు రాయితీపై ఎన్నో వ్యవసాయ పనిముట్లు ఇచ్చిందన్నారు. రాష్ట్రవిభజన తర్వాత విద్యుత్ విషయంలో నష్టం జరగకుండా కాంగ్రెస్ అధిష్ఠానం జాగ్రత్తలు తీసుకుందన్నారు. . వినియోగం ఆధారంగా తెలంగాణకే ఎక్కువ విద్యుత్ వచ్చేలా సోనియాగాంధీ చర్యలు తీసుకున్నారన్నారు.. ఆమె కారణంగానే తెలంగాణకు 53శాతం, ఏపీకి 47 శాతం విద్యుత్ కేటాయించారన్నారు.. అందుకోసం అప్పటి కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు కృషి చేశారు. ఉచిత విద్యుత్ పేటెంట్ కాంగ్రెస్ పార్టీదే అని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.. కేంద్రం కారు చౌకగా విద్యుత్ ఇస్తానన్నా కెసిఆర్ కమిషన్ ల కోసమే అవసరం లేకపోయినా యాదాద్రి ,భద్రాద్రి పవర్ ప్లాంట్ లను నిర్మించారని ఆరోపించారు.. తాను రైతునని, పొలంలో తనతో పాటు పని చేయగలరా అంటూ కెటిఆర్ కి సవాల్ విసిరారు..