Thursday, November 21, 2024

చెర్నోబిల్‌లో మళ్లీ ఆగిన విద్యుత్‌ సరఫరా.. అణుముప్పుపై ఐరోపా ఆందోళన

చెర్నోబిల్‌లోని అణువిద్యుత్‌ కేంద్రం మళ్లిd భయపెడుతోంది. కొన్ని దశాబ్దాల క్రితం పెద్దఎత్తున ప్రాణనష్టానికి కారణమైన ఈ ప్లాంట్‌ ఉక్రెయిన్‌లో ఉంది. అయితే సైనిక చర్య పేరుతో ఆ దేశంపై యుద్ధానికి దిగిన రష్యా క్షిపణులతో దాడి చేసి చెర్నోబిల్‌ అణువిద్యుత్‌ కేంద్రాన్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. దాడి అనంతరం కొద్దిరోజుల పాటు ఇక్కడ విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో అణు ధార్మికత బయటకు వచ్చేస్తుందని అంతా భయపడ్డారు. దీని ప్రభావం సమీపంలోని ఐరోపా దేశాలపై ఎక్కువగా ఉంటుంది. అయితే అక్కడి సిబ్బంది అతి త్వరగా స్పందించి పరిస్థితిని చక్కదిద్దారు. విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణతో అణుభయం తప్పింది. కాగా సోమవారంనుంచి మళ్లి విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ఆందోళన మొదలయ్యింది. స్లవుటిచ్‌ నగరం నుంచి చెర్నోబిల్‌ పవర్‌ ప్లాంట్‌కు విద్యుత్‌ సరఫరా చేసే లైన్లను రష్యా బలగాలు ధ్వంసం చేశాయని గ్రిడ్‌ ఆపరేటింగ్‌ ఏజెన్సీ ఉక్రెనెర్గో వెల్లడించింది.

అయితే అందుకుతగ్గ ఆధారాలు బయటపెట్టలేదు. మార్చి 9న పవర్‌ప్లాంట్‌కు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయినప్పుడు ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబ స్పందించి రష్యాను అప్రమత్తం చేశారు. కాల్పులు విరమించి మరమ్మతులకు అవకాశం ఇవ్వాలని, విద్యుత్‌ సరఫరా ఎక్కువసేపు నిలిచిపోతే రేడియేషన్‌ సమస్య తలెత్తుతుందని హెచ్చరించారు. ఆ తర్వాత సమస్య పరిష్కారమైంది. కాగా మళ్లిd ఇప్పుడు విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement