ప్రభన్యస్: చెత్త నుంచి విద్యుత్ ఉత్పాదన తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాదాయకంగా ఉందని తెలంగాణ విద్యుత్ నియంత్రణ కమిటి చైర్మన్ శ్రీరంగరావు అన్నారు. గురువారం ఆయనతో కూడిన 20 మంది అధి కారులు బృందం దక్షిణ భారత దేశంలోని అతిపెద్ద చెత్తతో విద్యుత్ తయారయ్యే ప్లాంట్‌ను సందర్శించారు. హైదరాబాద్ సమీకృత మున్సిపల్ శాలిడ్ వేస్ట్‌తో కూడిన ఎన్వీరో ఇంజినీర్స్ లిమిటెడ్ ప్లాంట్‌ను సందర్శించారు. రాంకీ సంస్థ నిర్వహిస్తున్న ఈ ప్లాంట్ ద్వారా 19.8 మెగావాట్ల దేశంలోనే అతిపెద్ద గ్యాస్ నుంచి కంప్రెస్‌డ్ బయోగ్యాస్ ఉత్పాదక సంస్థగా నడుస్తోంది.
పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా నిర్వహిస్తున్న ఈ ప్లాంట్ పనితీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ బృందాన్ని సంస్థ సీఈవో గౌతమ్‌రెడ్డి స్వాగతం పలికి సంస్థ ఉత్పాదకత, విద్యుత్ ఆదాకు తీసుకుం టున్న చర్యలు, ప్లాంట్ విశిష్టతను, ల్యాబ్ సౌకర్యాలను వివరించారు. ఇక్కడి బయోగ్యాస్ ప్లాంట్, నీటి శుద్ది ప్లాంట్‌ల పనితీరులను ప్రతినిధి బృందానికి వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..