Saturday, November 23, 2024

ముంచుకొస్తున్న విద్యుత్ సంక్షోభం.. జులై- ఆగస్టులో అంధకారమే : సీఆర్‌ఈఏ

భారత్‌లో చీకటి రోజులు రాబోతు న్నాయని, దేశ వ్యాప్తంగా విద్యుత్‌ సంక్షోభం ముప్పు పొంచి ఉందని సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ ఎనర్జీ అండ్‌ క్లీన్‌ ఎయిర్‌ (సీఆర్‌ఈఏ) అనే ఇండిపెండెంట్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ హెచ్చరించింది. మాన్‌సూన్‌కు ముందు దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని పవర్‌ ప్లాంట్స్‌లో బొగ్గు నిల్వలు నిండు కుంటున్నాయని తెలిపింది. దీంతో మరో విద్యు త్‌ సంక్షోభాన్ని భారత్‌ ఎదుర్కోక తప్పదని వివరించింది. జులై-ఆగస్టులో దేశ వ్యాప్తంగా చీకటి రోజులే దర్శనం ఇస్తాయని తెలిపింది. ప్రస్తుతం పిట్‌హెడ్‌ పవర్‌ స్టేషన్స్‌లో 13.50 మిలియన్‌ టన్నులు, దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని పవర్‌ ప్లాంట్స్‌లో 20.70 మిలియన్‌ టన్నుల బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయని సీఆర్‌ఈఏ తేల్చి చెప్పింది. బొగ్గు ఆధారిత విద్యుత్‌ ప్లాంట్లలో విద్యుత్‌ డిమాండ్లో స్వల్ప పెరుగు దలను కూడా పరిష్కరించలేని స్థితిలో ఉన్నాయని, బొగ్గు రవాణాకు ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని సూచించింది. ప్లాంట్స్‌కు సరిపడా బొగ్గు సరఫరా చేస్తే తప్ప.. విద్యుత్‌ సంక్షోభం నుంచి భారత్‌ బయటపడదని సీఆర్‌ఈఏ తెలిపింది.

ముందస్తు ప్రణాళికలు..

నైరుతి రుతు పవనాలు ప్రవేశించక ముందే విద్యుత్ ప్లాంట్స్‌కు సరిపడా బొగ్గును తరలించాలని సూచించింది. లేనిపక్షంలో జులై-ఆగస్టులో మరో విద్యుత్‌ సంక్షోభం తప్పదని హెచ్చరించింది సీఆర్‌ఈఏ. కొన్ని నెలల క్రితం ఏర్పడిన విద్యుత్‌ సంక్షోభం.. బొగ్గు ఉత్పత్తి వల్ల కాదని.. సరైన సమయంలో రవాణా చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే అని గుర్తు చేసింది. విద్యుత్‌ రంగంలో నెలకొన్న డిమాండ్‌కు సరిపడా బొగ్గు సరఫరా చేయడంలో మేనేజ్ మెంట్‌, కోల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని తెలిపింది. తగినంత బొగ్గు మైనింగ్‌ ఉన్నప్పటికీ.. థర్మల్‌ పవర్‌ స్టేషన్స్‌లో తగినంత నిల్వలు కనిపించ లేవని పేర్కొంది. 2021-22 ఆర్థిక సంవత్సరం లో భారతదేశం రికార్డు స్థాయిలో 777.26 మిలియన్‌ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 716.08 మిలియన్‌ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. అంటే 2020-21తో పోలిస్తే.. 2021-22లో 8.54 శాతం ఉత్పత్తి పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement