Saturday, November 23, 2024

Postponed – 14 అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నిక తేదీ మార్పు

న్యూ ఢిల్లీ – దేశంలోని మూడు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల పోలింగ్‌ తేదీ మారింది. ఇటీవల ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం.. దేశ వ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 48 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికకు గత నెలలో షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే.

దీని ప్రకారం కేరళ, పంజాబ్‌, యూపీలలో 14 అసెంబ్లీ సీట్లలో నవంబర్‌ 13న ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. కానీ, భాజపా, కాంగ్రెస్‌, బీఎస్పీ, ఆర్‌ఎల్‌డీతో పాటు పలు సామాజిక సంస్థలు పోలింగ్‌ తేదీని మార్చాలని ఈసీకి విజ్ఞప్తి చేశాయి. పలు సామాజిక, సాంస్కృతిక, మత సంబంధమైన కార్యక్రమాలు ఉన్నందున ఓటర్ల భాగస్వామ్యం తగ్గే అవకాశం ఉందంటూ ఆయా పార్టీలు చేసిన సూచనను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం కేరళ, పంజాబ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ పరిధిలో 14 అసెంబ్లీ సీట్లలో పోలింగ్‌ తేదీని నవంబర్‌ 20కి మార్పు చేసింది.

- Advertisement -

కేరళలో ఒకటి, పంజాబ్‌లో 4, యూపీలో 9 నియోజకవర్గాల్లో నవంబర్‌ 20న పోలింగ్ జరగనుండగా , మిగతా స్థానాల్లో మాత్రం తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ఈసీ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement