హైదరాబాద్, ఆంధ్రప్రభ : సివిల్ అసిస్టెంట్ సర్జన్ల పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 27 నుంచి 29 వరకు జోన్ల వారీగా కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు తెలిపారు. మల్లిdజోన్ 1లోని ఆరికి ఈ నెల 27, 28 తేదీల్లో, జోన్ -2 పరిధిలోని వారికి ఈ నెల 29న కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
అభ్యర్థులు తాము ఏయే ప్రాంతాల్లో పనిచేసేందుకు ఇష్టపడుతున్నారో ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని కౌన్సిలింగ్కు హా జరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు ప్రజారోగ్యశాఖ సంచాలకుల వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. ఎంపికైనప్పటికీ కౌన్సిలింగ్కు హాజరుకాని అభ్యర్థులకు సుమోటగా నియామక ప్రాంతాలను ఎంపిక చేసి ఉత్తర్వులను ఇంటికే పంపిస్తామన్నారు.