Friday, November 22, 2024

ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్‌.. ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ విభాగం కమిషనర్‌గా నియామకం

అమరావతి, ఆంధ్రప్రభ : సీనియర్‌ ఐపీఎస్‌, ఇంటిలిజెన్స్‌ మాజీ అధికారి ఏబి వెంకటేశ్వరరావుకు ఎట్టకేలకు పోస్టింగ్‌ దక్కింది. తన సస్పెన్షన్‌పై సుప్రీం కోర్టులో న్యాయపోరాటం సాగించిన ఏవిబి చివరికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పోస్టింగ్‌ సాధించారు. ఏపీ ప్రింటింగ్‌, స్టేషనరీ అండ్‌ స్టోర్స్‌ విభాగం కమిషనర్‌గా ఆయన్ను నియమిస్తూ జగన్‌ సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఏబీవీని తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నట్లు నోటిఫై చేసింది.

గత నెల 19 నుంచే ఆయనను విధుల్లోకి తీసుకున్నట్లు చీఫ్‌ సెక్రటరీ సమీర్‌ శర్మ అధికారికంగా వెలువరించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయనపై సస్పెన్షన్‌ ఎత్తివేయడంతో.. గతనెల మే 19న సాధారణ పరిపాలనశాఖకు ఏబీవీ రిపోర్టు చేశారు. ఆయనకు తాజాగా పోస్టింగ్‌ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఇప్పటివరకు ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ కమిషనర్‌ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న జి.విజయకుమార్‌ను ఇక్కడి నుంచి రిలీవ్‌ చేసి ఆ స్థానంలో ఏబీవీని నియమించింది. కాగా విజయ్‌కుమార్‌ను హోంశాఖ అదనపు ఇన్‌ఛార్జీ గా నియమించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement