Wednesday, November 20, 2024

మోడీ, అమిత్‌షాలకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌.. యువకుడి అరెస్టు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీజేపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ముపుర్‌శర్మ పోస్ట్‌పై బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు క్షమాపణలు చెప్పాలని, లేకపోతే నిరసనలను ఎదుర్కోవాల్సి వస్తుందంటూ సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన యువకుడిని హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ పోస్ట్‌ను పాతబస్తీకి చెందిన మాజిద్ అత్త‌ర్‌ అని గుర్తించిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఇంక్విలాబ్‌ – ఏ – మిల్లత్‌ నాయకుడైన అత్తర్‌ చేసిన పోస్టుు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేది ఉంది పోలీసులు పేర్కొన్నారు.

ఈ పోస్టులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలకు బెదరింపులు కూడా ఉన్నాయంటూ పోలీసులకు ఫిర్యాదులు కూడా అందాయి. రెండు వర్గాల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులున్నాయని పోలీసులు చెబుతున్నారు. మాజీద్‌పై ఐపీసీ సెక్షన్‌ 153 ఎ, 235ఎ, 504, 506 – 2 ల కింద కేసు నమోదు చేశారు. అరెస్టు చేసిన మాజిద్‌ను కోర్టులో హాజరు పరిచారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement