ప్రపంచంలోని ఏ దేశ ప్రగతికైనా, పతనానికైనా సహజ వనరులతో పాటు మానవ వనరుల పాత్ర గణనీయంగా ఉంటుంది. జనాభా నియంత్రణ చేస్తూ ముందుకు సాగాలనే ఉద్ధేశంతో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూలై 11వ తేదీన నిర్వహిస్తారు. అయితే 1987 జూలై, 11న ప్రపంచ జనాభా 500 కోట్లు (5 బిలియన్లు) చేరుకున్న రికార్డు సందర్భంగా పురస్కరించుకుని. 1989 నుండి ఐక్యరాజ్యసమితి దీనిని ఆచరించాలని నిర్ణయించింది. ప్రపంచ దేశాలన్ని జనాభా సమస్యను అదిగమించుటకు విస్తృత ప్రచారం, అవగాహన, చైతన్య కార్యక్రమాలు సమితి ఆదేశాలతో సభ్యదేశాలు నిర్వహిస్తున్నాయి. ప్రపంచాన్ని, మన దేశాన్ని ప్రస్తుతం పట్టి పీడిస్తున్న జఠిలమైన సమస్య అధిక జనాభా. దీని వలన తలెత్తే దుష్పరిణామాలు ఆహార పదార్థాల కొరత, స్థలం కొరత, పేదరికం, ఉపాధి, ఉద్యోగలేమి సమస్యలు తలెత్తుచున్నాయి. ఈ పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చుటకు పాలకులు చేస్తున్న కృషి సఫలీకృతం కావాలంటే ? జనస్థిరీకరణ, నియంత్రణ చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందనేది వాస్తవం. ప్రపంచంలోని ఏ దేశ ప్రగతికైనా, పతనానికైనా జనాభా అతి ప్రధాన కారణంగా నిలుస్తుంది. అవసరమైన స్థాయిలో పెరిగే జనం ఆదేశ అభివృద్ధికి దోహదపడుతుంది. మరణాల రేటు తగ్గుతూ అడ్డు అదుపు లేకుండా జననాల రేటు పెరుగడాన్ని ”జనాభా విస్పోటనం” గా మారటంతో అది ప్రగతికి ఆటంకంగా మారి అధోగతికి దారితీస్తుంది. అప్పటి వరకు సాధించిన ఆర్థికాభివృద్ధిని హరించి అనర్థాలకు దారితీసి సామాజిక, రాజకీయ, ఆర్థిక సమస్యలను సృష్టిస్తూ పతనానికి కారణమౌతుంది. అందుకనే ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు జనాభా నియంత్రణ చర్యలు చేపట్టాల్సి ఉంది. కానీ ప్రపంచమంతటా స్వార్థమే స్వైరవిహారం చేస్తుంది. వేరు వేరు రూపాల్లో మ్యాన్‌పవర్ (ప్రజాబలం)ను వాడుకోవాలని ఒకవైపు మూఢనమ్మకాలు (విశ్వాసం) ఆచారాల పేరుతో ప్రాంతం, కులాలు, మతాలు, జాతులు, వర్ణాలు ఆధిపత్య భావజాలంతో అక్షరాస్యులు, నిరక్షరా స్యులనే బేధం లేకుండా ప్రాం తాల నుండి ప్రపంచం వరకు, ప్రాంతీయ నాయకుల నుండి ప్రపంచ నేతలవరకు బహిరంగం(అంతర్గతం)గా ద్వంద్వ విధానాలు అవలంభిస్తున్నారు.
చిన్న, పెద్ద దేశాలు జనాభా పెరుగుదలను అడ్డుకోలేక పోతున్నాయి. జనాభా పెరుగుదల విపత్తును నియంత్రించడానికి ఐక్యరాజ్య సమితితో కలిసి ప్రపంచ దేశాలు సామాజిక బాధ్యతలో వ్యక్తుల నుండి ప్రపంచం యావత్తు జనాభా నియంత్రణ అమలుకు పూనుకోవాలి. జనాభా పరంగా భారతదేశంప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉంది. కొద్ది కాలంలోనే మొదటిస్థానం చేరనుంది. మన దేశంలో స్వాతంత్య్రానికి ముందు జనాభా లెక్కల సేకరణ తొలిసారిగా 1872లో లార్డ్ మేయో చేసినప్పటికీ పూర్తి స్థాయిలో 1881 లార్డ్ రిప్పన్ కాలంలో చేశారు. ఆ తరువాత మన స్వతంత్ర దేశంలో 1948లో జనాభా లెక్కల సేకరణ చట్టం అమలులోకి వచ్చింది. అనంతరం 1951లో తొలిసారిగా జనాభా గణన ప్రారంభించారు. అలా పదేళ్లకోసారి జనాభా లెక్కలు సేకరిస్తారు. ఈ విధంగా 1951 నుండి 2011 మధ్య 7 సార్లు జనన గణన చేశారు. 2020లో జనాభా గణన జరగాల్సి ఉండగా కరోనా వలన వాయిదా పడింది. కేంద్ర హూంశాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది. డిజిటల్ విధానంలో చేయాలని చూస్తుంది.
మన దేశ జనాభా నియంత్రణకు వ్యక్తిగతంగా, సామా జికంగా సమిష్టి బాధ్యతగా కుల, మత, వర్గ, లింగ వివక్షలు మాని నియంత్రణ(శస్త్ర చికిత్సల)ను నిర్భం ధంగా అమలు జరపాలి. జనాభా పెరుగుదలను ఆపి తీరాలి. ప్రభుత్వాలు స్థానిక సంస్థల్లో ప్రజా ప్రతినిధులుగా నిలబడాలంటే ? ఇద్దరు పిల్లలకు మించి ఉండరాదనే చట్టం తెచ్చారు. అది పంచాయితీ నుండి పార్లమెంట్ ప్రజాప్రతినిధుల వరకు ఒకరికన్నా మించితే పదవి అర్హత ఉండకుండా చట్టాన్ని సవరించి కఠినంగా అమలు చేస్తే, భావితరాలకు మేలు జరుగుతుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.