మరిపెడ, ప్రభన్యూస్ : రైతు సంక్షేమానికి ఎన్నో పథకాలు తెచ్చి రాష్ట్రంలో రైతును రాజు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చెర్మెన్ గుడిపూడి నవీన్ రావు అన్నారు. బుధవారం ఆయన తెలంగాణ యాసంగి ధాన్యం మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ప్రకటించటంపై హర్షం వ్యక్తం చేస్తూ మరిపెడ మండల కేంద్రంలో బుధవారం కేసీఆర్ చిత్రపటానికి క్షీరభిషేకం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మూడు నెలలుగా రైతుల పక్షాన దీక్షలు పోరాటాలు చేసినా కేంద్రం తన వక్రబుధ్ది మార్చుకోలేదని, ఇక రైతు సంక్షేమమే ముఖ్యమని సీఎం కేసీఆర్ రాష్టంలో పండిన యాసంగి పంట మొత్తం కొనుగోలు చేస్తామన్నారు. మరో నాలుగు రోజుల్లో పూర్తి స్థాయి రైతు కొనుగోలు కేంద్రాలను రాష్ట ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రారంభిస్తామన్నారు. రైతుల కోసం కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలు దేశాన్నె నివ్వరపరుస్తున్నాయని, ఆఖరికి బీజేపీ కూడా తమ రైతు బందు పథకాన్ని కాపీ కొట్టిందని తెలిపారు.
తెరాసా హయాంలో అందరికి చేయూత…
తెలంగాణ ఆవిర్భావం అనంతరం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో అన్ని మతాల వారికి సముచిత స్థానం కల్పించిందని, ముస్లింల అభ్యున్నతికి ఎల్లవేళల కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ అని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ గుడిపూడి నవీన్ రావు అన్నారు. బుధవారం ఆయన మరిపెడ మండల కేంద్రంలోని మదర్సా – యే – ఇస్లామియా రౌజతుల్-బనాత్ కమిటీ ఆధ్వర్యంలో సహాయకల్ ట్రస్ట్ వారి సహకారంతో అందించి రంజాన్ తోఫాను సుమారు 100మంది పేద ముస్లింలకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం సర్వ మతాలను సమానంగా చూస్తోందన్నారు. వారి వారి అవసరాలకు అనుగుణంగా పాఠశాలు, రెసిడెన్షియల్, పథకాలను అమలు చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు. ముస్లింలకు పెద్ద పండుగ అయినా రంజాన్ నెలలు పేద ముస్లింలకు 11రకాల సరుకులు అందజేయటం అభినందనీయం అన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాకా ముస్లిం సోదరులను అన్ని మతాలతో సమానంగా, గతంలో ఏ ప్రభుత్వం చేయని కార్యక్రమాలు చేశారన్నారు. తెలంగాణ ఏర్పడ్డాకా ఏడేళ్ల కాలంలో ఒక్క మత ఘర్షన లేని ప్రాంతంగా తెలంగాణ ప్రశాంతంగా ఉందన్నారు. అదే విధంగా ప్రతి రంజాన్ నెలలో ముస్లింలకు ఇఫ్తార్ విందు, రంజాన్ తోఫాలు అందించటం తెలంగాణ ప్రభుత్వ నిబద్దతకు నిదర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుగులోత్ అరుణ రాంబాబు, జడ్పీటీసీ తేజావత్ శారదా రవీందర్, మున్సిపల్ చైర్మన్ గుగులోత్ సింధూర రవి, వైస్ ఎంపిపి గాదె అశోక్ రెడ్డి, మాజీ ఒడిసిఎమ్మెస్ ఛైర్మెన్ కుడితి మహేందర్ రెడ్డి, తెరాస నాయకులు రామడుగు అచ్యుత్ రావు, తెరాస పట్టణ అధ్యక్షుడు ఉప్పల్ నాగేశ్వరరావు, కో అప్షన్ మక్సుద్, మండల మైనార్టీ అధ్యక్షుడు హాబీబ్, పట్టణ మైనారిటీ అధ్యక్షుడు లతీఫ్, తెరసా మండల ఆర్గనైజింగ్ కార్యదర్శి యాకుబ్ పాషా, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యుడు జర్పుల కాలునాయక్, తెరాస నాయకులు నారెడ్డి సుదర్శన్ రెడ్డి, వీసారపు శ్రీపాల్ రెడ్డి, పానుగోతు వెంకన్న, మాచర్ల భద్రయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి సుమంత్, కృష్ణ, కౌన్సిలర్లు ఉరుగొండ శ్రీనివాస్, శ్రీను, హతిరం, ఏడేళ్లి పరశురాములు, తెరాసా అధ్యక్షుడు బాలాజీ, రజబ్ అలీ, శ్రీను, పానుగోతు వెంకన్న, మదర్శా వ్యస్థాపకులు సత్తార్, సలీం, సాదిక్, మన్సూర్ అలీ, తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..