గసగసాల నుంచి నల్లమందు తయారుచేస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే. నల్ల మందు ఒక మాదకద్రవ్యం. అందువల్ల గసగసాల పంట సాగుపై అనేక దేశాలతో పాటు ఇండియాలోనూ నిషేధం ఉంది. గసగసాల కాయల నుండి మాదకద్రవ్యంగా ఉపయోగించే నల్లమందు మార్ఫిన్ ఉత్పత్తి అవుతుండటమే ఇందుకు కారణం.
అయితే భారతదేశంలో మాత్రం వైద్య, శాస్త్రీయ అవసరాలకుగాను కేంద్ర ప్రభుత్వం కొంత మినహాయింపు ఇచ్చింది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కేంద్రం దీని సాగుకు అధికారికంగా అనుమతిస్తోంది. ఈ పంట సాగు చేయాలంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కొటిక్స్ జారీ చేసే లైసెన్స్ తప్పనిసరి. దేశంలో ఎవరైనా ఎక్కడైనా అనుమతి లేకుండా గసగసాల పంట సాగుచేసినా, నిల్వ ఉంచినా, రవాణా చేసినా, విక్రయించినా తీవ్రమైన నేరమవుతుంది. నార్కొటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్స్ చట్టం ప్రకారం కఠినమైన నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేస్తారు. దోషులుగా తేలితే పదేళ్లకు పైగా జైలుశిక్ష, రూ.1.5 లక్షల వరకు జరిమానా విధిస్తారు.
ఇది కూడా చదవండి: కొండెక్కిన చికెన్ ధర