పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజాగానటిస్తున్న మూవీ ఉస్తాద్.. హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో దాదాపు 10 ఏళ్ల తర్వాత వస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో పవన్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. అయితే ఈ మూవీ గింప్స్ విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఒక పోస్టర్ విడుదల చేసింది.. అయితే ఈ పోస్టర్ లో పవన్ పాదాల కింద ఉస్తాద్ భగత్ సింగ్ టైటిల్ ఉంది. దీనిపై నటి పూనమ్ కౌర్ ఘాటుగా స్పందించింది.. ఇది స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ ని కించపరచడమే అంటూ ట్వీట్ చేసింది.
ఈ చిత్రంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలి. భగత్ సింగ్ లాంటి స్వాతంత్ర యోధుడి పేరుని కాళ్ళ కింద పెట్టడం ఏంటి.. ఇది కించపరచడం కదా అంటూ పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. ఇది అహంకార పూరితమైన చర్య అంటూ పూనమ్ కౌర్ ఈ చిత్రంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
పవన్ ‘ఉస్తాద్’ పోస్టర్ – పూనమ్ కౌర్ గరం గరం
Advertisement
తాజా వార్తలు
Advertisement