Monday, September 16, 2024

Pooja Khedkar కు కేంద్రం బిగ్ షాక్..

మాజీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్‌కు కేంద్రం షాక్ ఇచ్చింది. ఆమెను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఐఏఎస్ (ప్రొబేషన్) రూల్స్, 1954 ప్రకారం ఆమెపై చర్యలు తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపాయి.

కాగా పుణెలో ఐఏఎస్ ప్రొటిషనరీ సమయంలో అధికార దుర్వినియోగంతో పాటు యూపీఎస్సీలో తప్పును అపిడవిట్ పత్రాలు సమర్పించారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. సివిల్ సర్వీసెస్కు ఎంపిక అయ్యేందుకు ఓబీసీ, వికలాంగుల కోటాలో నకిలీ దృవీకరణ పత్రాలు సర్పించినట్లు… నిబంధనలకు మించి సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసినట్లు తెలిసింది. దీంతో ఈ వ్యవహారంపై యూపీఎస్సీ దర్యాప్తు చేపట్టింది. నకిలీ పత్రాలతో పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లు గుర్తించిన యూపీఎస్సీ దానిపై వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులిచ్చింది. ఆమెపై ఫోర్జరీ కేసు నమోదు చేయడంతో పాటు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement