సినీ నటులకి ఫ్యాన్స్ ఉండటం సాధారణమే.కానీ ఆ అభిమానం శృతి మించితే..అదే జరిగింది హీరోయిన్ యషిక విషయంలో. ఆమె ఫ్యాన్స్ ఆమె ఫొటోలకు మొక్కుతున్నారు.. హారతులు ఇస్తున్నారు.. . దేవతలా పూజించటం మొదలుపెట్టారు. వారు దండం పెడుతోన్న పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నారు. ఈ విషయంలో యషిక స్పందించింది. తాను కూడా మనిషినేనని.. తనను దేవతను చేయవద్దంటుంది. దేవుళ్లకు మాత్రమే పూజలు చేయండి.. నాకు కాదు అంటూ ఫ్యాన్స్ ను రిక్వెస్ట్ చేస్తుంది యషిక. అభిమానం పెరిగితే వారి పేర్లు ఒంటి మీద టాటూ వేయించుకోవడం.. ప్లెక్సీలు పెట్టడం, పేరు మీద రకరకాల పనులు చేయడం. ఆకరికి గుడి కట్టడం వరకూ కూడా ఆ పిచ్చి ఇక తమిళనాట ఖుష్బు, నమిత లాంటి స్టార్స్ కు ఏకంగా గుడి కట్టి మరీ అభిమానాన్ని చాటుకున్నారు. ఇప్పుడు ఆ అభిమానం ఇంకా పెరిగింది. కోలీవుడ్ యంగ్ హీరోయిన్ యషికా ఆనంద్ పై తమ అభిమానాన్ని ఇంకాస్త డిఫరెంట్ గా చూపించుకుంటున్నారు ఫ్యాన్స్. ఆమె ఫోటోలకు పూజలు చేస్తూ.. హారతులిస్తూ..దేవత మాదిరి కొలుస్తున్నారు. ప్రస్తుతం ఈపిక్స్, వీడియోస్ నెట్టింట వైరల్గా మారాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement